Big Stories

Read Brain Activity:మెదడు కదలికలను గుర్తించే మైక్రోస్కోప్..

Read Brain Activity:మైక్రోస్కోప్ అనేది కంటికి క్షుణ్ణంగా కనిపించని అతి చిన్న వస్తువులను కూడా స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. హెల్త్ సెక్టార్‌లోనే కాదు ఎన్నో ఇతర విభాగాల్లో కూడా ఈ మైక్రోస్కోప్ పరిశోధనలు చేయడానికి సహాయపడుతుంది. తాజాగా న్యూరోసైన్స్ విభాగంలో మైక్రోస్కోప్ కంటే మరింత మెరుగైన మినీ మైక్రోస్కోప్ తయారీకి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -

బ్యాక్టిరియా వంటి కంటికి కనిపించిన వాటిని పరీక్షించడానికి మైక్రోస్కోప్ ఉపయోగపడుతుంది. కానీ బ్రెయిన్‌లోని ఆలోచనలను గమనించడానికి ఓ మైక్రస్కోప్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన పరిశోధకులకు వచ్చింది. అదే ఆలోచనను నిపుణుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లేందుకు వారికి ఆర్థికంగా సహాయం కూడా లభించింది. ఈ పరిశోధన న్యూరోసైన్స్ విభాగంలో మరో కొత్త అధ్యాయానానికి శ్రీకారం చుట్టనుంది.

- Advertisement -

మినీ మైక్రోస్కోప్ (మినీ2పి) ప్రాణాలతో ఉన్న ఎలుక బ్రెయిన్ యాక్టివిటీని చదవడంలో సక్సెస్ సాధించింది. మినీ2పి అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఓ గేమ్ ఛేంజర్‌గా మారనుందని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా వారికి తగిన సహాయం అందుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

ప్రాణం ఉన్న బ్రెయిన్ యాక్టివిటీని చదవడానికి మినీ2పి ఉపయోగపడుతుందన్నారు. మెదడులో ఉన్న సెల్స్ అన్నీ కలిసి ఎలా మెమోరీని తయారు చేయనున్నాయో వారు స్టడీ చేయనున్నారు. ఈ పరిశోధన ప్రారంభమయ్యి ముందుకు వెళ్తున్న సమయానికి వారికి మరింత ఆర్థిక సహాయం అందనుందని సమాచారం. ఈ ఫండింగ్‌లో ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకెన్‌బర్గ్ ముఖ్య పాత్ర పోషించారు.

ఇప్పటికే దశాబ్ద కాలంలో దాదాపు చాలావరకు అంతుచిక్కని వ్యాధులకు మెడిసిన్‌ను కనుక్కోవాలని ఉత్సాహంగా ఉన్న శాస్త్రవేత్తలకు ఈ మినీ2పి అండగా నిలబడనుంది. దీని ద్వారా మెదడు వ్యాధులను కూడా ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది శాస్త్రవేత్తలు భాగం కానున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News