Simbu : తమిళ స్టార్ హీరో శింబు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఆయన సినిమాలు రావడంతో ఇక్కడ కూడా ఆయన పేరు అందరికీ తెలుసు. మన్మధ వంటి రొమాంటిక్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శింబు ఈ మధ్య తెలుగులో సినిమాలు చెయ్యలేదు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘మానాడు’ చిత్రంతో ఆయన మరోసారి బ్లాక్ బస్టర్ హిట్‌ను కొట్టాడు. హీరోగానే కాకుండా విలన్, సింగర్ గా కూడా రానిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాంటి శింబు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య హీరోయిన్ తో ఎఫైర్ అని పెళ్లి అని వార్తలు వినిపించాయి. కానీ ఈ మధ్య నిధి అగర్వాల్ తో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.
శింబు పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. గతంలో హీరోయిన్ నయనతారతో ఎఫైర్ ఉందని వార్తలు వినిపించాయి. అప్పటిలో పెద్ద దుమారం రేపాయి. ఇద్దరు బయట తిరుగుతూ మీడియాకు దొరికేవాళ్లు. అయితే ఏమైందో ఏమో కానీ వీరిద్దరికీ బ్రేకప్ అయింది. ఆ తర్వాత హన్సికను ప్రేమించాడు. అది కూడా అంతే.. పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఎఫైర్ ల మాటలు ఎక్కువగా వినిపించాయి. కానీ పెళ్లి గురించి అయితే వినిపించలేదు. ఇక సినిమాల పై ఫోకస్ పెట్టాడు శింబు.. కానీ ఇన్నాళ్లకు తన పెళ్లి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ఈ 41 ఏళ్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇన్నాళ్లకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. హీరోయిన్ నిధి అగర్వాల్ కలిసి నటించిన మూవీ ఈశ్వరన్. ఇక ఈ సినిమా టైంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్టూ, డేటింగ్ కూడా చేస్తున్నట్లు పలు పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, దీనికి ఇరువైపులా కుటుంబ సభ్యులు అంగీకరించారని, ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఈ వార్తలు కాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే శింబు ఫాదర్ రాజేంద్ర కూడా మొన్నీమధ్య పెళ్లి చేసుకోబోతున్నాడని హింట్ ఇచ్చాడు.. దాంతో ఈ వార్తలు నిజమని తెలుస్తుంది.
మరి నిధి అగర్వాల్ తో పెళ్లి నా లేక మరో హీరోతో పెళ్లి చేసుకుంటాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ వార్త మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శింబు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ రెదను సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.. వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి.