Suchi Leaks : తమిళ స్టార్ హీరోయిన్ నయనతార పేరు ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ఆమె సినిమాల కన్నా తనకు తానే కోరి తెచ్చుకుంటున్న వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో నిత్యం నయనతార పేరు వార్తల్లో నిలుస్తుంది. ఇటీవల ధనుష్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. అవి ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపాయి. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు పేరు తెగ వినిపిస్తుంది. తాజాగా ప్రముఖ సింగర్ సుచిత్ర హీరోయిన్ నయనతార పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే నయనతార లీకులను బయట పెట్టింది. అసలు సుచి లీక్స్ లో నయన్ సీక్రెట్స్ ఏం చెప్పిందో ఇప్పుడు తెలుసుకుందాం..
సింగర్ సుచిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే.. సుచి లీక్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి తన నోటికి చిక్కిన వాళ్లను బూతులు తిడుతూ రెచ్చిపోతుంది. ఆమె ఎప్పుడు ఎవరిని అంటుందో, ఎవరో భాగోతాలను నిస్సంకొంచెంగా బయట పెడుతుంది. ఆమె నోటికి హద్దులు లేవు. ఒకసారి దొరికితే మాత్రం అవతల వ్యక్తికి చుక్కలే.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నిజం చెప్తుందా అని చాలా మంది తెగ వెతికేస్తుంటారు. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది. రీసెంట్ గా నయన్ హీరో ధనుష్ మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ధనుష్‌ను విమర్శిస్తూ విడుదల చేసిన ప్రకటనను తాను చూశానన్నారు. అందులో ధనుష్ పై ఉన్న ఆరోపణలన్నీ నయనతార వెల్లడించారన్నారు. దీంతో తాను నయనతారను అభినందించానన్నారు..
ప్రస్తుతం కోర్టులో జరుగుతున్న వివాదం ధనవంతులైన ఇద్దరి మధ్య జరుగుతున్న పోరు అని పేర్కొన్నారు. మీ ఇద్దరి ఇళ్లల్లోనూ డబ్బు రూ.కోట్లలో మూలుగుతోందన్నారు. ఈ ఇద్దరికీ డబ్బు అహంకారం పెరిగిపోయిందన్నారు. కాగా నటి నయనతార చాలా గౌరవప్రదంగా మాట్లాడే వారిని అయితే ఇటీవల ఆమె ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన చిత్రాల కంటే తన డాక్యుమెంట్ మూవీ ప్రేక్షకులు అధికంగా చూశారని పేర్కొనడం తన అహంకారం అని బూతులు తిట్టేసింది. డబ్బులు ఉన్నాయి కదా నేను ఏమన్నా చెల్లుతుందని అనుకుంటే పొరపాటే.. ఆమె గతంలో ఎలా ఉంది అనేది మాత్రం మర్చిపోవద్దు. తప్పు ఎవరు ఎవరు చేస్తున్నారో ఆలోచించడం మంచిది అని హితవు పలికారు. ఇక మొన్న బాలీవుడ్‌కు చెందిన అనుపమ చోఫ్రా గత రెండేళ్లుగా ప్రముఖుల ను ఇంటర్వ్యూ చేస్తున్నారని, ఆమె ప్రముఖులను మోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. అలాగే ఆమె నటి నయనతారను పొగడ్తలు ముంచేశారన్నారు. అందుకు ఆమె భారీగా డబ్బు పొందినట్లు తెలిసిందన్నారు.. అలాగే గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు అని నయనతార కు ఇండైరెక్ట్ గా చివాట్లు పెట్టింది. దీనిపై నయనతార ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ప్రస్తుతం సుచి లీక్స్ వీడియో అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన వారంతా కామెంట్స్ చేస్తున్నారు.. నయనతారకు పొగరు బాగానే ఉందని తగ్గించుకుంటే మేలని సలహా ఇస్తున్నారు.