ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( ICC Champions Trophy 2025 ) సంబంధించిన కీలక అప్డేట్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్… హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ) . అయితే హైబ్రిడ్ మోడల్ కు… ఇండియా అలాగే పాకిస్తాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…. దుబాయ్ వేదిక గా టీమిండియా మ్యాచ్ లు అన్నీ జరగనున్నాయి.
Also Read: Gukesh – Rashmika: టాలీవుడ్ హీరోయిన్ కి గుకేశ్ కి ఉన్న రిలేషన్?
ఈ తరుణంలో…. చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( ICC Champions Trophy 2025 ) సంబంధించిన…. షెడ్యూలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే గ్రూప్ ఏ , గ్రూప్ బి గా జట్లను విభజించనుందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ లెక్క ప్రకారం గ్రూపు A లో పాకిస్తాన్ అలాగే, టీమిండియా చోటు దక్కించుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం కచ్చితంగా గ్రూప్ స్టేజిలో… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైట్ కచ్చితంగా ఉంటుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గ్రూపు A లో టీమిండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ జట్టు ఉన్నాయి. ఇటు గ్రూప్ బి లో ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. మొత్తం చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్లో…. 8 జట్టు పాల్గొనబోతున్నాయి. ఈ మేరకు… రెండు గ్రూపులుగా జట్లను డివైడ్ చేసిందట అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చేయబోతుందట ఐసీసీ. అంతేకాదు… 2025 ఫిబ్రవరి 23వ తేదీన… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉండనుందట. అయితే… ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్కు వేదిక దుబాయ్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటినుంచే ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ అందరు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉండగా… అంతర్జాతీయ టోర్నమెంటులో ఇప్పటికే… పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఆధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే.
ఆడిన ఎక్కువ మ్యాచ్లో టీమ్ ఇండియానే గెలిచింది. చివరగా 2023 ప్రపంచ కప్ లో… పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడడంతో… టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా అన్ని జట్లు పాకిస్తాన్ వెళ్లి… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో పాల్గొనాలి. కానీ భద్రతా కారణాల వల్ల టీమిండియా పాకిస్తాన్ వెళ్లడం లేదు. దీంతో హైబ్రిడ్ మోడల్ లో నిర్వహించేందుకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 10 వ తేదీ వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగనున్నట్లు సమాచారం.
గ్రూప్ A: పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, బంగ్లాదేశ్
గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్
Also Read: Wrestler Rey Mysterio: WWE లెజెండ్ రే మిస్టీరియో మృతి !
Possible Groups In 2025 CT 🏆 pic.twitter.com/KnvvthKzoP
— RVCJ Media (@RVCJ_FB) December 21, 2024