BigTV English

Singer Yasaswi:సెల‌బ్రిటీ ముసుగులో సింగ‌ర్ య‌శ‌స్వి మోసం

Singer Yasaswi:సెల‌బ్రిటీ ముసుగులో సింగ‌ర్ య‌శ‌స్వి మోసం
Singer Yasaswi

టాలీవుడ్ సింగ‌ర్ య‌శ‌స్వి చుట్టూ ఇప్పుడు వివాదం న‌డుస్తుంది. అస‌లేం జ‌రిగిందంనే వివ‌రాల్లోకి వెళితే.. సింగ‌ర్ య‌శ‌స్వికి మంచి పేరుంది. శ‌ర్వానంద్, స‌మంత జంటంగా న‌టించిన జాను సినిమాలో లైఫ్ ఆఫ్ రామ్ పాట‌ను స‌రిగ‌మ‌ప పాట‌ల పోటీలో పాల్గొన్న‌ప్పుడు అద్భుతంగా పాడాడు. ఆ పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ రావ‌టంతో య‌శ‌స్వి పేరు మారుమోగిపోయింది. అయితే ఈయ‌న సెల‌బ్రిటీ ముసుగులో తాను చేయ‌ని ప‌నికి త‌న పేరు వేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం చేశాడు. ఫ‌లితం రివ‌ర్స్ అయ్యింది.


వివ‌రాల్లోకి వెళితే ఓ సింగింగ్ కాంపీటీష‌న్‌లో పాల్గొన్న‌యశ‌స్వి తాను న‌వ సేన పేరుతో యాబై మందికి పైగా అనాథ పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పిస్తున్నాన‌ని అన్నారు. దానికి సంబంధించిన ప్రోమో డిసెంబ‌ర్‌లో విడుద‌లైంది. అయితే ఈ వార్త‌ల‌ను న‌వ సేన స్వ‌చ్చంద సంస్థ నిర్వాహ‌కురాలు ఫ‌రా కౌస‌ర్ ఖండించారు. య‌శ‌స్వి త‌మ ఫౌండేష‌న్‌లోని పిల్ల‌ల‌ను విష్ చేయ‌టానికి వ‌స్తాన‌ని చెప్పి వీడియో చిత్రీక‌రించుకున్నార‌ని, కానీ ఆయ‌నా రాలేదు.. ఫౌండేష‌న్‌కు స‌హాయం కూడా చేయ‌లేద‌ని ఆమె వాపోయారు. సాయం చేయ‌క‌పోతే పోయారు, కానీ స్వ‌చ్చంద సంస్థ పేరుని మాత్రం వాడేసుకుంటున్నార‌ని అన్నారు ఫ‌రా కౌస‌ర్‌.

కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఇంట‌ర్వ్యూస్‌లో ఆమె మాట్లాడుతూ తాను ఐదు సంవ‌త్స‌రాలుగా న‌వ సేన ఫౌండేష‌న్‌ను నిర్వ‌హిస్తున్నాన‌ని ఆమె తెలిపారు. అందులో 56 మంది అనాథ పిల్ల‌ల‌కు తాను చ‌దువు చెప్పిస్తున్నాన‌ని అన్నారు. ఈ సేవాశ్ర‌మం పేరుని య‌శ‌స్వి ఎలాంటి అనుమ‌తి లేకుండా వాడేసుకున్నాడ‌ని, క‌నీసం తన పర్మిషన్ కూడా తీసుకోలేదని, అయితే డిసెంబర్ 31న కార్యక్రమంలో భాగంగా తమ సేవా సంస్థ పేరువాడేశారని, విషయం తెలిసిన తర్వాత.. తాను వెళ్లి కలిస్తే కనీసం సారీ కూడా చెప్ప‌లేద‌ని ఆమె తెలిపారు. మ‌రి త‌ను చుట్టూ న‌డుస్తున్న వివాదంపై య‌శ‌స్వి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మ‌రి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×