Sivakarthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వశక్తితో పైకి వచ్చిన హీరోగా శివకార్తికేయన్ కు కోలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో రెమో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అవకాశాలు దొరికాయి కదా అని ఏ కథలు పడితే ఆ కథలు ఒప్పుకోకుండా.. విభిన్నమైన కథలను ఎంచుకొని స్టార్ హీరోగా మారాడు.
గతేడాది అమరన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివకార్తికేయన్. మేజర్ ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటించాడు అనడం కన్నా జీవించాడు అని చెప్పొచ్చు. ఈ సినిమా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ సాధించింది. ఇక అమరన్ తరువాత శివకార్తికేయన్.. లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో చేతులు కలిపాడు. ఆకాశం నీ హద్దురా సినిమా తో తెలుగు ప్రేక్షకులను సైతం అలరించిన ఆమె.. హిందీలో ఇదే సినిమాను రీమేక్ చేసి చేతులు కాల్చుకుంది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని బాగా కసితో SK25 ను మొదలుపెట్టింది.
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ నేడు రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి పరాశక్తి అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు తెలుపుతూ ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శివకార్తికేయన్ కాకుండా రవి మోహన్, అథర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందాల భామ శ్రీలీల హీరోయిన్ గా కనిపిస్తుంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 1965 లో జరిగిన కాలేజ్ గొడవల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు చూపించారు.
Samyuktha Menon : గోల్డ్ కలర్ డ్రెస్సులో గోల్డెన్ బ్యూటీ అదిరిపోయే స్టిల్స్.. ఏముంది మామా..
కాలేజ్ యూత్ లీడర్ గా శివకార్తికేయన్ కనిపించగా.. అథర్వ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించాడు. ఇక రవి మోహన్ పాత్ర నెగెటివ్ రోల్ అని టీజర్ లో చూపించారు. భాష కోసం జరిగే యుద్ధంగా ఈ సినిమాను సుధా కొంగర తెరకెక్కించినట్లు సమాచారం. అంతేకాదు.. ఈ సినిమా సి ఎన్నో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోందని చెప్పుకోస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ నెట్టింట వైరల్ గా మారాయి.
సుధా కొంగర సినిమా అంటే.. ఒక హీరో ఒకదానికోసం పోరాడుతూ ఉంటాడు. దానికి రాజకీయాలు అడ్డుపడుతూ ఉంటాయి. వాటిని తొక్కుకుంటూ హీరో ఎలా ఎదిగాడు.. ? అనుకున్నది ఎలా సాధించాడు.. ? అనేది ఉంటుంది. అందులోనూ ఆ సినిమాలన్నీ నిజజీవితంలో జరిగినవే.. అంటే సక్సెస్ అందుకున్న వ్యక్తుల బయోపిక్స్ అన్నమాట.
ఇప్పటివరకు ఆమె తీసిన కథలు గురు, ఆకాశం నీ హద్దురా.. అలాంటివే. ఇప్పుడు పరాశక్తి కూడా ఒక వ్యక్తి బయోపిక్ అని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. 1965 లో భాష కోసం జరిగిన యుద్ధంలో మరణించిన ఒక కాలేజ్ లీడర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని శివకార్తికేయన్ పాత్రను రాసినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజమున్నది అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే సినిమాపై హైప్ పెట్టుకోవడానికి ఇంతకన్నా పెద్ద కారణం ఉండదు. మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.