Whatsapp Governance: వాట్సాప్ అంటే అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ఉండాల్సిందే. అలాంటి వాట్సప్ తో ఒక బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాలనా పరమైన అంశాలలో కూడ ఇప్పటి నుండి వాట్సాప్ కీలక పాత్ర పోషించనుంది. ఈ మేరకు వాట్సాప్ గవర్నెన్స్ పై సీఎం చంద్రబాబు సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వార అందించే సేవలపై సీఎం చర్చించారు.
దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం తన సేవలను ఈజీ పద్దతిలో ప్రజలకు చేరువ చేయాలని భావించింది. అందులో భాగంగా వాట్సాప్ ద్వారా సేవలు కొనసాగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నిర్ణయంతో గత ఏడాది మెటాతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విజన్ 2047 కు తగ్గట్లుగా, ఏపీలో ప్రభుత్వ సేవలు స్పీడ్ గా సాగించాలన్నదే ఈ ఒప్పందం లక్ష్యం. మొత్తం 161 సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వార రేపటి నుండి ప్రభుత్వం ప్రారంభించేందుకు సిద్దమైంది. ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్షించిన సీఎంకు ప్రజెంటేషన్ ద్వార వివరించారు.
వాట్సాప్ గవర్నెన్స్ తో ఉపయోగాలు..
ప్రస్తుతం రెవిన్యూ, సచివాలయాల ద్వార అందే సేవల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి. ఏ ధృవీకరణ పత్రం కావాలన్నా, ఇప్పుడు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ వాట్సాప్ లో తగిన ధృవీకరణ పత్రాలు అప్ లోడ్ చేస్తే చాలు, సంబంధిత పత్రం మనకు వాట్సాప్ లోనే రానుంది. దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
Also Read: Lady Aghori: లేడీ అఘోరీ కోసం పోలీసుల గాలింపు.. ఏ క్షణమైనా అరెస్ట్?
ఈ సదుపాయంతో మనం ఎక్కడున్నా మనకు కావాల్సిన దృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. అదే పనిగా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు రవాణా ఖర్చులతో పాటు, సమయం కూడ ఆదా కానుంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతంగా సాగించేందుకు అన్ని శాఖల అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు లబ్ది చేకూర్చాలన్న లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకు వచ్చినట్లు, ప్రజలకు ఈ విధివిధానాలపై అవగాహన కల్పించాలని అధికారులను సీఎం కోరారు.