BigTV English

Mahindra Thar Five Door: అందిరిచూపు దీనిపైనే.. ఆగస్టు 15న థార్ లాంచ్.. ఫోటోలు లీక్!

Mahindra Thar Five Door: అందిరిచూపు దీనిపైనే.. ఆగస్టు 15న థార్ లాంచ్.. ఫోటోలు లీక్!
Advertisement

Mahindra Thar Five Door: దేశీయ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా ఇప్పటి వరకు థార్ 5 డోర్ వెర్షన్ ఫోటోలు లీక్ అవకుండా జాగ్రత్త పడింది. కానీ ఇప్పుడు తాజాగా 5 డోర్ థార్ పోటోలు లీక్ అయ్యాయి. వీటి ఆధారంగా థార్ లాంచ్ అయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఆగస్టు 15 న ఈ కారు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. లాంచ్ సమయం దగ్గరపడతుండగా ఈ 5 డోర్ల థార్ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల టెస్టింగ్ సమయంలో దాని మోడల్ కనిపించింది. వీటి నుంచి కొంత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. వాటి వివరాలను వివరంగా తెలుసుకుందాం.


లీక్ అయిన ఫోటోలను చూసినట్లయితే మహీంద్రా థార్ 5 డోర్‌ను కనిపించకుండా కవర్ చేశారు. అయితే దాని కలర్ ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తుంది. అందులో బ్లాక్, రెడ్ కలర్స్ కనిపిస్తాయి. ఈ ఎస్‌యూవీ 5 లేదా 6 రంగుల్లో లాంచ్ అవుతుందని ఇప్పటికే టాక్ వినిపిస్తోంది.దీని డిజైన్‌లో చాలా మార్పుడు కనిపిస్తాయి. వాటి గురించి చెప్పాలంటే ఇది ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లను కలిగి ఉంటుంది. ఇవి రౌండ్ షేప్‌లో ఉంటాయి.

Also Read: New Electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. 100 కిలోమీటర్ల రేంజ్.. రూ.లక్షతో దక్కించుకోండి!


ఇది కాకుండా కొత్త మల్టీ స్లాట్ గ్రిల్, సైడ్ స్టెప్స్ ఉన్నాయి. వీటిని 3 డోర్ల థార్ మోడల్‌లో కనిపిస్తాయి. టర్న్ ఇండికేటర్లు దాని ఫెండర్లలో ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఇది ప్లాస్టిక్ క్లాడింగ్, కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లు,టెయిల్ ల్యాంప్‌పై స్పేర్ టైర్‌కు కవర్ ఉంటుంది. మహీంద్రా థార్ 5 డోర్‌లో అనేక కొత్త ఫీచర్లు ఉన్నాయి.

ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ యూనిట్, డ్యూయల్ పేన్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్, యూఎస్‌బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్, బి పిల్లర్ మోంటెడ్ రియల్ డోర్ హ్యాండిల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంజన్, పవర్‌ట్రెయిన్ మహీంద్రా థార్‌ 5 డోర్‌లో థార్ 3 డోర్ మాదిరిగానే ఉంటాయి.

Also Read: Tata Curvv: టాటా కర్వ్ ఈవీ.. ప్రత్యేకతలు ఇవే.. త్వరలో లాంచ్!

అదే 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. ఈ కొత్త మహీంద్రా 5 డోర్ల థార్ ఫోర్స్ గుర్జా 5 డోర్ కారుతో పాటు హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, ఎమ్‌జీ ఆస్టర్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలతో పోటీపడుతుంది. మహీంద్రా 5 డోర్ల థార్‌తో తన అభిమానులను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో వాహన ప్రియుల అందరిచూపు ఆగస్టు 15 మీదే ఉంది. ఆ రోజున థార్ లాంచ్ కానుంది. ఇది ఎలాంటి అద్భుతాలు చేస్తుందో చూడాలి.

Related News

Big Bang Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి డీల్స్.. ప్రతి 4 గంటలకు కొత్త ఆఫర్లు.. ఇన్‌స్టంట్ 10శాతం డిస్కౌంట్!

Jio New Feature: జియో ఆటో పే లో జస్ట్ ఇలా చేస్తే చాలు.. నెలనెలా రీఛార్జ్ తలనొప్పి ఉండదు

Sovereign Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్లపై 338% రాబడి.. దీపావళి ముందు అదిరిపోయే గిఫ్ట్

Amazon Diwali Offers: అమెజాన్ దీపావళి ఆఫర్లు.. 80% తగ్గింపు, రూ.80 క్యాష్‌బ్యాక్! బ్యూటీ ప్రోడక్ట్స్ పై భారీ తగ్గింపు

Hyderabad Postal: హైదరాబాద్ లో 24×7 స్పీడ్ పోస్ట్ బుకింగ్.. నైట్ షిఫ్ట్ ప్రారంభించిన పోస్టల్ శాఖ

BSNL Diwali Offer: బీఎస్ఎన్ఎల్ దీపావళి బొనాంజా ఆఫర్.. రూ.1కే కొత్త కనెక్షన్.. ఉచిత సిమ్, రోజుకు 2 జీబీ డేటా

EPFO New Rules: PF ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ.. ఈ కొత్త నియమాలు మీకు తెలుసా?

Diwali Gold: రూ.41 వేలకే 10 గ్రాముల బంగారం కొనేయండి.. జస్ట్ ఇలా చేస్తే చాలు

Big Stories

×