BigTV English

Baby Vernika: సన్నాఫ్ సత్యమూర్తిలో బన్నీతో పాటు యాక్టింగ్ అదరగొట్టిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో చూసారా.. ?

Baby Vernika: సన్నాఫ్ సత్యమూర్తిలో బన్నీతో పాటు యాక్టింగ్ అదరగొట్టిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో చూసారా.. ?

Baby Vernika: ఇప్పుడంటే చైల్డ్ ఆర్టిస్టులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. కానీ, ఒకప్పుడు ప్రతి సినిమాలో కచ్చితంగా ఒక కీలక పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ కనిపించేది. వారు హీరోయిన్స్ తో పాటు అంతే ఎక్కువ గుర్తింపు తెచ్చుకొనేవారు. అలా ఒక్క సినిమాతోనే స్టార్ఇమేజ్ ను తెచ్చుకున్న చిన్నారి బేబీ వర్ణిక. త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గుర్తుందిగా. అందులో ఛలో ఛలో సాంగ్ మర్చిపోవడం కష్టమే. ఇక ఆ సాంగ్ లో ఈ చిన్నారి వర్ణికను చూడొచ్చు.


ముద్దు ముద్దుగా బూరి బుగ్గలు వేసుకొని.. బాబాయ్ అల్లు అర్జున్ ను ఐస్ క్రీమ్ కోసం ఏడిపిస్తూ కనిపిస్తుంది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటించిన విధానం అలాగే ఉపేంద్ర నటన కూడా ఆ సినిమాలో చాలా హైలైట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాతో బేబీ వర్ణికకు ఎంతో పేరు వచ్చింది.

సన్నాఫ్ సత్యమూర్తి తరువాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ ప్రీత్ చిన్నప్పటి పాత్రలో నటించింది. బంగారుబాబు సినిమాలో జగపతి బాబుతో కూడా నటించింది. మళ్ళీ ఆ తర్వాత వర్ణిక పెద్దగా సినిమాలు చేసింది లేదు. అందుతున్న సమాచారం ప్రకారం వర్ణిక చదువు రీత్యా తల్లిదండ్రులు నటనకు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. గతేడాది ఈ చిన్నదాని ఓణీల వేడుక ఎన్టీజూ గ్రాండ్ గా జరిగింది. అప్పటి ఫోటోలు నెట్టింట్లో బాగా వైరల్ గా మారాయి.


ఇక ఇప్పుడు ఈ చిన్నదాని లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 లోని సూసెక్కి అగ్గిరవ్వ మాదిరి అనే సాంగ్ ను వర్ణిక.. రీల్ చేసి రచ్చ లేపింది. ఈ వీడియోలో ఆమె ఎంతో అందంగా ఉంది. హీరోయిన్ రేంజ్ కాకపోయినా టీనేజ్ లో ఉన్నట్లు కనిపిస్తుంది. బ్లాక్ నైట్ డ్రెస్ పై ఒక చున్నీ వేసుకొని డ్యాన్స్ స్టెప్ వేస్తూ కనిపించింది. బొద్దుగా ఉండే వర్ణిక.. చక్కగా కుందనపు బొమ్మలా మారింది. ఇక ఈ వీడియోను అల్లు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరి ముందు ముందు వర్ణిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×