BigTV English

New York Pitch: రూ. 250 కోట్లు వృథాయేనా..? న్యూయార్క్ క్రికెట్ పిచ్ తీసేస్తారా?

New York Pitch: రూ. 250 కోట్లు వృథాయేనా..? న్యూయార్క్ క్రికెట్ పిచ్ తీసేస్తారా?

New York Pitch: టీ 20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మూడు ఇంపార్టెంట్ మ్యాచ్‌లు ఇక్కడే ఆడింది. అదే న్యూయార్క్ లోని నస్సావ్ కౌంటీ క్రికెట్ స్టేడియం. ఇప్పుడందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. హాట్ ఆఫ్ ది ఇంటర్నెట్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రపంచకప్ అయిన వెంటనే ఈ క్రికెట్ స్టేడియంను నేలమట్టం చేయనున్నారనే సమాచారం నెట్టింటిని షేక్ చేస్తోంది.


అప్పటికప్పుడు ప్రపంచ కప్ కోసం ఈ క్రికెట్ స్టేడియంను మూడు నెలల్లో రెడీ చేశారు. ఆ నిర్మాణానికి సంబంధించిన వీడియోలు, అప్ డేట్స్ అన్నీ సోషల్ మీడియాని షేక్ చేశాయి. దీనికోసం సుమారు రూ.250 కోట్లు ఖర్చు చేశారని చెబుతున్నారు. ఇక డ్రాప్ ఇన్ పిచ్ లను ఆస్ట్రేలియా నుంచి ఎంతో ఖర్చు పెట్టి, షిప్పుల్లో తీసుకొచ్చారు. గ్రౌండ్ పూర్తయ్యాక వాటిని పెద్ద పెద్ద క్రేనుల్లోంచి తెచ్చి గ్రౌండులో అమర్చారు.

అలాగే కుర్చీలను కూడా రోజుకి ఇంతని అద్దెకు తీసుకొచ్చారు. వాటిని టెంపరరీగా అమర్చారు. గ్రాస్ ను అలాగే తెచ్చారని అంటున్నారు. ఆ స్టేడియంలో ఉన్న ప్రతీది కూడా టెంపరరీ అనే కాన్సెప్ట్ లోనే జరిగింది. ఇక ఆ గ్రాస్ కింద ఇసుక వేయడం వల్ల, బ్యాటర్లు ఎంత కొట్టినా సరే, బాల్ ఫోర్లు వెళ్లలేదని అంటున్నారు. ఎంత చేసినా, పిచ్ పై సరైన రిజల్ట్ రాలేదు. సరికదా తీవ్ర విమర్శలు వచ్చాయి.


టీ 20 మ్యాచ్ లు అంటే, జోష్ ఉండాలి. నీరసం ఉండకూడదు. ఇక్కడ పిచ్ పై మహామహా జట్లు సైతం 150 పరుగులను దాటలేదు. అంతేకాదు ఆటగాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరి అందువల్ల తీసేస్తున్నారా? భవిష్యత్తులో పర్మినెంట్ గా నిర్మిస్తారా? అన్నది తెలీదు. లేదంటే టీ 20 వరల్డ్ కప్ అవసరాల రీత్యా, న్యూయార్క్ లో ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి, తాత్కాలికంగా నిర్మించారా? అన్న సంగతులు త్వరలోనే తెలుస్తాయి.

Also Read: ’10 రుపీకీ పెప్సీ.. కోహ్లీ భాయ్..!’ విరాట్‌పై అభిమానుల గజల్స్..

ఇప్పుడు ప్రపంచ కప్ మ్యాచ్ లు అయిన వెంటనే ఈ స్టేడియంను తీసేయనున్నారనే వార్త మాత్రం హల్చల్ చేస్తోంది. కాకపోతే ఇండియా మ్యాచ్ ల ద్వారా రూ.100 కోట్ల వరకు లాభాలు వచ్చాయని అంటున్నారు. ఇతర మ్యాచ్ లు, ఇంకా పబ్లిసిటీలు వీటన్నింటి ద్వారా స్టేడియంకు ఖర్చు చేసిన డబ్బులు వచ్చేశాయని చెబుతున్నారు. అందువల్ల కూల్చేసినా పెద్ద ఫరక్ పడదని చెబుతున్నారు.

అయితే అందరూ గొప్పగా చెప్పుకునే అంశం ఏమిటంటే, మూడు నెలల్లో మెగా టోర్నమెంట్ కి, అంటే ఐసీసీ నిర్వహించే టీ 20 ప్రపంచకప్ నకు అవసరమయ్యే రీతిలో, అంతర్జాతీయ మ్యాచ్ లు జరిగే స్థాయిలో ఒక స్టేడియంను నిర్మించడం అసాధ్యమనే చెప్పాలి. అలాంటిదాన్ని సుసాధ్యం చేసిన మన టెక్నాలజకీ అభినందనలు చెప్పాలి.

Related News

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Big Stories

×