BigTV English

Sonia Singh: ప్రియుడితో రొమాంటిక్ యాంగిల్.. క్యూటెస్ట్ కపుల్ అంటూ నెటిజన్స్..!

Sonia Singh: ప్రియుడితో రొమాంటిక్ యాంగిల్.. క్యూటెస్ట్ కపుల్ అంటూ నెటిజన్స్..!

Sonia Singh:ఇటీవల కాలంలో సెలెబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు బ్యాచిలర్ లైఫ్ ను వీడి కొత్త బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే కొంతమంది ప్రేమలో పడితే , మరి కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు. ఈ క్రమంలోని విరూపాక్ష సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సోనియా సింగ్ (Sonia Singh) ప్రేమలో విహరిస్తోందని చెప్పవచ్చు.


షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ ఆరంభం..

ముఖ్యంగా ఈ బ్యూటీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా న్యూ ఏజ్ గర్ల్ ఫ్రెండ్ , నాన్ తెలుగు గర్ల్ ఫ్రెండ్, పెళ్లయిన కొత్తలో వంటి లఘు చిత్రాలలో నటించిన ఈమెకు సినిమాలలో నటించే అవకాశం లభించింది. అలా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా , సంయుక్త మీనన్ (Samyuktha menon) హీరోయిన్ గా నటించిన విరూపాక్ష (Virupaksha ) సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన సోనియా సింగ్ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు అవకాశాలు కూడా తలుపు తట్టినట్టు సమాచారం.


సినిమాలే కాదు సీరియల్స్ కూడా..

సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా నటించింది సోనియా సింగ్. యమలీల (Yamaleela )సీరియల్ లో కూడా నటించి మెప్పించిన ఈమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన అందాలతో ఎప్పటికప్పుడు నెటిజన్స్ ని ఆకట్టుకునే సోనియా ఎప్పుడో ప్రేమలో పడి, పెళ్లికి సిద్ధం అన్నట్టు హింట్ ఇచ్చింది. గత కొద్దిరోజులుగా తన కో యాక్టర్ అయిన సిద్దు పవన్ (Siddhu Pawan) తో ఈమె ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పలు బుల్లితెర షోలలో పాల్గొన్నప్పుడు ఈమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది కూడా. ఇక దీంతో ఎప్పటికప్పుడు ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది సోనియాసింగ్.

క్యూట్ కపుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్స్..

ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తన ప్రియుడుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో కపుల్ డ్రెస్ వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన నెటిజన్స్ క్యూటెస్ట్ కపుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు . అంతే కాదు కాబోయే వాడితో రొమాంటిక్ యాంగిల్ సూపర్ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

త్వరలో పెళ్లి..

ప్రస్తుతం ప్రేమలో విహరిస్తున్న ఈ జంట త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ కూడా నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి నిజంగానే పెళ్లి పీటల వరకు వెళ్తారా..? లేక కొంతమంది సెలబ్రిటీల లాగే ప్రేమ వరకే పరిమితం అవుతారా? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ క్యూట్ జంట కు ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×