BigTV English

YS Jagan: బాధిత కుటుంబాలకు పదేసి లక్షలు.. 74 కుటుంబాలకు ఇస్తున్నారా?

YS Jagan: బాధిత కుటుంబాలకు పదేసి లక్షలు.. 74 కుటుంబాలకు ఇస్తున్నారా?

YS Jagan: అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ స్టయిల్ మారిందా? మీడియాకు వైసీపీ మసాలా ఇస్తోందా? గొప్పలకు పోయి నవ్వుల పాలవుతుందా? నేతల మాటల మధ్య పొంతన కుదరడం లేదా? ఒకరు ఒకలా.. మరొకరు ఇంకోలా ఎందుకు చెబుతున్నారు? అధికార పార్టీని ఇరుకున పెట్టబోయి.. ఇరుకున పడుతున్నారా? మీడియా ముందు అబద్దాలు చెబుతోందా? అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందిన హార్డ్‌కోర్ అభిమానులు.


వైసీపీ సోషల్‌ మీడియా విభాగం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దాని సారాంశం ఏంటంటే.. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించింది. బాధిత కుటుంబాలకు అండగా పార్టీ తరపున 10 లక్షల చొప్పున ఇస్తున్నామని పేర్కొంది.

వైసీపీ అంత ఇస్తే.. అధికార కూటమి ఎంత ఇవ్వాలన్నది ఆ పార్టీ ప్రశ్న. వైసీపీ ప్రశ్నించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉంది. ఇటీవల రాష్ట్రంలో అఘాయిత్యా లకు గురైన ఆరు మంది ఆడ బిడ్డల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు జగన్.


రెండు రోజుల కిందట మీడియా ముందుకొచ్చిన వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఓ విషయాన్ని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు 74 మంది ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు జరిగాయని బయట పెట్టారామె. దీంతో మీడియా మిత్రులు షాకయ్యారు.

ALSO READ:  కూటమి ప్రభుత్వంపై శ్యామల ఆగ్రహం.. మహిళలకు న్యాయం ఎక్కడంటూ ప్రశ్న

ఆ బాధిత కుటుంబాలకు పదేసి లక్షల చొప్పున వైసీపీ అందజేస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో దీనిపై రకరకాలుగా ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. బాధిత కుటుంబానికి పదేసి లక్షల చొప్పున లెక్కిస్తే.. 74 మంది బాధిత కుటుంబాలకు.. దాదాపు 7 కోట్ల 40 లక్షలన్నమాట. వారందరికీ పరిహారం వైసీపీ అందిస్తుందా? అనేది అసలు పాయింట్.

 

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×