E-Paper
Advertisement

Trivikram Srinivas About Pottel Movie : బ్లాక్ బస్టర్ రాసుకోండి ఈ మాట

Trivikram Srinivas About Pottel Movie : బ్లాక్ బస్టర్ రాసుకోండి ఈ మాట
Advertisement

Trivikram Srinivas About Pottel Movie : యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా ‘పొట్టేల్’. ఈ చిత్రంలో అజయ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ కూడా మంచీ హిట్ అయ్యాయి. ‘పొట్టేల్’ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి సవారి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సాహిత్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా 25న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ చిత్ర యూనిట్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కలిసింది. ఈ సినిమా ట్రైలర్ను కూడా చూపించారు. అలానే ఈ సినిమా కథ గురించి దర్శకుడు త్రివిక్రమ్ కి వివరించిన వీడియో ఎప్పుడో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పొట్టేలు సినిమా ట్రైలర్ చూసి త్రివిక్రమ్ బాగా ఇంప్రెస్ అయ్యారు. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది రాసుకోండి ఈ మాట అంటూ త్రివిక్రమ్ రియాక్ట్ అయ్యారు. అలానే చిత్ర యూనిట్ అంతా కూడా ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పొట్టేలు సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకులు కూడా చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

సందీప్ రెడ్డి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ కథ విన్నాను. చిన్న కథ చేసుకున్నానని సాహిత్ చెప్పాడు. కథ విన్నాక..ఇది చిన్న కథ కాదు చాలా పెద్ద కథ అనిపించింది. నేను సినిమా చూశాను. చాలా బాగా నచ్చింది. రెండు పాటలు చాలా బాగా నచ్చాయి. ట్రైలర్ కూడా చాలా బాగుంది. అజయ్ గారు సినిమా అంతా భయపెట్టించి వదిలారు. యువ, అనన్య, నోయల్ జీవ అందరు సూపర్ గా యాక్టింగ్ చేశారు. సాహిత్ ఇంత అద్భుతంగా తీస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. సాహిత్ చిన్న కథ అన్నాడు కానీ నాకు చాలా పెద్ద బడ్జెట్ కనిపించింది. ఎలా తీస్తాడు అనుకున్నాను. ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషన్ తో సినిమా తీశారు. సినిమా చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుంది. న్యూ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇటీవల యంగ్‌ డైరెక్టర్లు ఎవరూ ఇలా పూర్తిస్థాయి రూరల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయలేదనుకుంటున్నా. ఆ బ్యాక్‌డ్రాప్‌లో ‘రంగస్థలం’ తర్వాత నేను చూసిన సినిమా ఇదే. అందరికీ ఆల్ ది బెస్ట్. దిస్ ఫిలిం విత్ బిగ్ హార్ట్. అక్టోబర్ 25న ప్లీజ్ కం అండ్ వాచ్. చిన్న సినిమాని అందరూ ఎంకరేజ్ చేయండి. థాంక్యూ’ అన్నారు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×