BigTV English

Soundarya Death : మోహన్ బాబు అందుకే సౌందర్యను చంపించారు… కీలక విషయాలు వెల్లడి

Soundarya Death : మోహన్ బాబు అందుకే సౌందర్యను చంపించారు… కీలక విషయాలు వెల్లడి

Soundarya Death : 22 ఏళ్ల తర్వాత దివంగత హీరోయిన్ సౌందర్య (Soundarya)ను హత్య చేశారు అంటూ ఓ అభిమాని కంప్లైంట్ ఫైల్ చేయడం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ సామాజిక కార్యకర్త, సౌందర్య అభిమాని మంచు మోహన్ బాబు (Mohan Babu)పై ఈ మేరకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మోహన్ బాబు నివసిస్తున్న జల్లేపల్లి గెస్ట్ హౌస్ కోసమే సౌందర్యను ఆయన హత్య చేయించాడని పోలీసులతో పాటు ఖమ్మం కలెక్టరేట్లో కూడా అతను కంప్లైంట్ చేయడం, మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది.


మోహన్ బాబుపై అభిమాని షాకింగ్ ఆరోపణలు

ఖమ్మం జిల్లా, సత్యనారాయణపురంలో నివాసం ఉంటున్న ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి మంచు మోహన్ బాబు సినిమా యాక్టర్ సౌందర్య, ఆమె తమ్ముడు అమర్నాథ్ లను హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని, ఈ ఘటనపై విచారణ జరిపి, నిజానిజాలను నిర్ధారించాలని డిమాండ్ చేస్తూ చిట్టి మల్లు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు ఓ లేఖను కూడా రిలీజ్ చేశారు. తాజాగా చిట్టిమల్లు మీడియాతో మాట్లాడుతూ శంషాబాద్ లోని జల్లేపల్లిలో ఉన్న ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ అమ్మమని మోహన్ బాబు సౌందర్యను అడిగాడని, కానీ సౌందర్య ఇష్టంగా కొనుక్కున్నాను కాబట్టి అమ్మలేనని చెప్పిందని సదరు వ్యక్తి ఆరోపించారు.


తాను 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సౌందర్య ఇంటికి వెళ్లానని, అప్పుడే అక్కడున్న అందరూ సౌందర్య పై మోహన్ బాబు ఆ ఫామ్ హౌస్ కోసం పగ పెంచుకున్నాడని మాట్లాడుకోవడం విన్నానని షాకింగ్ విషయాలను బయట పెట్టాడు. ఆ తరువాత ఏడాదికే సౌందర్యను హత్య చేసి, హెలికాప్టర్ ప్రమాదంగా చిత్రీకరించారని చిట్టిమల్లు చెప్తున్నాడు. అంతేకాకుండా సౌందర్య, ఆమె తమ్ముడు చనిపోవడంతో ఆ ఫామ్ హౌస్ ను సొంతం చేసుకోవడానికి అడ్డు లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. సౌందర్య చనిపోయాక భూమిని అమ్మాలని మోహన్ బాబు ఆమె కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చి, తన సొంతం చేసుకున్నాడని, మోహన్ బాబు అక్రమంగా సంపాదించిన ఆ భూమిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవసరమైన అనాదాశ్రమాలు, వృద్ధాశ్రమాలు లేదంటే ఇతర మంచి పనుల కోసం వాడాలని సదరు అభిమాని డిమాండ్ చేస్తున్నాడు. మరి చిట్టి మల్లు పెట్టిన కేసుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

సౌందర్య చనిపోయి 22 ఏళ్లు  

ఇదిలా ఉండగా సౌందర్య చనిపోయి ఇప్పటికే 22 ఏళ్లు పూర్తవుతుంది. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ అచ్చ తెలుగు కట్టు బొట్టుతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది సౌందర్య. అప్పట్లో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ఆమె తెలుగుతోపాటు ఇతర భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానుల ఆరాధ్య దేవతగా కొలువుదీరిన సౌందర్య కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అందరికీ షాక్ ఇచ్చింది. 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో ఆమె కన్నుమూశారు. అప్పట్లో ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసేందుకు బెంగళూరు నుంచి బయలుదేరిన సౌందర్య హెలికాప్టర్ బ్లాస్ట్ కావడంతో బాడీ కూడా దొరకనంతగా కాలిపోయింది. అలాగే ఆమె సోదరుడు కూడా మృతి చెందాడు. సౌందర్య మరణం యావత్ సినీ ప్రపంచాన్ని దుఃఖసాగరంలో ముంచేసింది.

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×