Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం… చాలా టాలెంట్ ఉన్న నటుడు. అయితే పాపం… హిట్సే రావడం లేదు. 6 ఏళ్ల కెరీర్‌లో చెప్పుకొదగ్గ హిట్ అంటే… అది ‘క’ మాత్రమే. అయితే ఈ ‘క’ మూవీ తర్వాత కిరణ్ కెరీర్ మొత్తం టర్న్ అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఇక రాబోయే సినిమాల బిజినెస్ కు సంబంధించి సమస్యలు ఉండవు అని కూడా అనుకున్నారు. కానీ, ‘క’ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీకే బజ్ లేదు. అలాగే ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రాలేని పరిస్థితి.
‘క’ బ్లాక్ బస్టర్ అయినా… కూడా కిరణ్ అబ్బవరంకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ చర్చ జరుగుతుంది. అయితే ఈ దిల్ రూబా మూవీకి బయ్యర్లు రాకపోవడానికి, బజ్ లేకపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం…
‘క’ ఇండస్ట్రీ హిట్ తర్వాత యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చేస్తున్న మూవీ ఈ దిల్ రూబా. ఈ మూవీ 10 నుంచి 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. కిరణ్ అబ్బవరంకు జోడీగా రుక్సార్ ధిల్లాన్ నటిస్తుంది. ఈ నెల 14న రిలీజ్ చేయబోతున్నారు ఈ మూవీని. అయితే… ఇప్పటి వరకు ఈ సినిమాకు ఉన్న బజ్ జీరో అనే చెప్పొచ్చు. నిన్న ఈ మూవీ ఈవెంట్ ఒకటి అయింది. అందులో నిర్మాత ‘ఈ మూవీలో యాక్షన్ సీన్స్ బాలేకపోతే… నన్ను వచ్చి కొట్టండి’ అంటూ స్టెట్‌మెంట్ ఇచ్చాడు. అయినా… ఈ సినిమాకు బజ్ రావడం లేదు. దీనికి మూడు కారణాలు చెప్పొచ్చు.
1st రీజన్ – ‘క’ ముందు పరిస్థితి…
కిరణ్ అబ్బవరం కెరీర్ మొత్తంలో హిట్ మూవీ అంటే… ఇటీవల వచ్చిన ‘క’ మూవీ అనే చెప్పొచ్చు. దీనికి ముందు ‘రాజావారు రాణివారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాంటి సినిమాలు కొంత వరకు మెప్పించినా… అవి కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అలాగే పెద్దగా హిట్ అవ్వలేదు.
ఇంకా ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ కూడా భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ‘మీటర్’, ‘రూల్స్ రంజన్’ లాంటి సినిమాలు అయితే… ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి. ఇప్పుడు ‘క’ ఒక్క మూవీ హిట్ అయినంత మాత్రానా… కిరణ్ అబ్బవరంను ఆడియన్స్, బయ్యర్లు పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. అలాంటి సినిమాలు మరో రెండు, మూడు సినిమాలు పడితే… అప్పుడు కిరణ్ స్టోరీ సెలక్షన్ పైన ఓ నమ్మకం ఏర్పడుతుంది. వచ్చే సినిమాలను చూడాలనే ఫీల్ ఆడియన్స్ లో వస్తుంది. బయ్యర్లకు ఆ సినిమాను కొనుగొలు చేయాలని అనిపిస్తుంది.
2nd రీజన్ – ఎగ్జామ్స్ ప్రభావం…
సినిమాలను ఎక్కువ చూసేది యూత్. ఆ యూత్‌లో ఇంకాస్త లోతుగా చూస్తే ఎంటర్ చదివే వాళ్లే సినిమాలు ఎక్కువగా చూస్తారని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ నెల 17 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి.
అంటే తెలంగాణలో యూత్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఏపీలో ఆ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సో… ఆ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ సినిమా హాల్స్‌కు రావడం ఆసాధ్యం. దీని వల్ల కూడా సినిమాపై బజ్ లేదు. బయ్యర్లు కూడా థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పొచ్చు.
3rd రీజన్ – ఈ సీజన్…
అవును నిజమే… ఈ సీజన్ కూడా దిల్‌రూబా మూవీకి బజ్ లేకుండా చేస్తుంది. బాక్సాఫీస్ వద్ద చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ, ఒక్క మూవీకి కూడా సరైన రిజెల్ట్ రాలేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న మజాకా మూవీ కూడా కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. మంచి ఓపెనింగ్స్ తెచ్చుకోలేక పోయింది. ఇప్పుడు దిల్‌రూబా మూవీకి కూడా అదే జరుగొచ్చు అని అంటున్నారు సినీ క్రిటిక్స్. ఇలా… రాంగ్ టైంలో దిల్ రూబా మూవీ వస్తుందని అని కూడా అనుకొచ్చు.
మొత్తంగా దిల్ రూబా సినిమాకు బజ్ లేకపోవడానికి, బయ్యర్లు ముందుకు రాకపోవడానికి ఈ మూడు కారణాలు అనుకొచ్చు.