BigTV English

Gautam Gambhir: రిలాక్స్ లేదు… ఇంగ్లండ్ భరతం పట్టేందుకు గంభీర్ సంచలన నిర్ణయం !

Gautam Gambhir: రిలాక్స్ లేదు… ఇంగ్లండ్ భరతం పట్టేందుకు గంభీర్ సంచలన నిర్ణయం !

Gautam Gambhir: 12 సంవత్సరాల తర్వాత ఫైనల్ లో న్యూజిలాండ్ ని ఓడించి భారత జట్టు ఛాంపియన్స్ ట్రోపీని గెలుచుకుంది. 8 నెలలలోనే వరుసగా రెండవ ఐసీసీ టైటిల్ ని దక్కించుకుంది భారత్. గతేడాది జూన్ లో దక్షిణాఫ్రికాను ఓడించి టి-20 ప్రపంచ కప్ ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు. భారత్ ని విశ్వవిజేతగా నేర్పిన అనంతరం అతడు పదవి నుండి వైదొలిగాడు.


 

అనంతరం భారత హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. ఇక కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత మిశ్రమ ఫలితాలతో విమర్శలు ఎదుర్కొన్నాడు గౌతమ్ గంభీర్. ఈ ఐసీసీ ట్రోఫీ విజయంతో వాటన్నిటికీ సమాధానం ఇచ్చాడు. తన హయాంలో తొలిసారి ఐసీసీ ట్రోపీని భారత జట్టుకు అందించాడు. ఆరంభంలో శ్రీలంకతో వన్డే సిరీస్ ఓటమి, ఆ తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ తో వైట్ వాష్, ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ని కోల్పోవడంతో గౌతమ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.


దీంతో తనని తాను నిరూపించుకోవడానికి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి అవకాశమని అంతా భావించారు. ఇక ఈ టోర్నీలో భారత జట్టును విజయపథం వైపు నడిపించి అందరి నోళ్లు ముగించాడు గౌతమ్ గంభీర్. ఇక ఇప్పుడు ఐపీఎల్ కోసం భారత క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ప్రధాన కోచ్ గా గంభీర్ కి ఈ ఐపీఎల్ ముగిసేంతవరకు జట్టుతో ఉండాల్సిన అవసరం లేదు. ఆ తదుపరి సిరీస్ ల కోసం వ్యూహాలను సిద్ధం చేసుకునేందుకు అతడు సిద్ధమవుతున్నాడు.

ఈ నేపథ్యంలో గంభీర్ భారత ఏ జట్టుతో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. సీనియర్ జట్టు జూన్ లో ఇంగ్లాండ్ కి వెళ్ళనుంది. ఆలోగా భారత ఏ జట్టు పర్యటన ఉండనుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా పర్యటన అనంతరం బీసీసీఐ పెద్దలతో చర్చించారట గంభీర్. భారత ఏ జట్టుతో అతడు ప్రయాణిస్తే.. రిజర్వ్ బెంచ్ ని మరింత బలంగా మార్చుకునే అవకాశం ఉంటుందనేది గంభీర్ అభిప్రాయం.

అలాగే భారత్ ఏ పర్యటనలలో ఓ కీలక విషయం గుర్తించారు. ద్రావిడ్ కోచ్ గా వచ్చాక పరిపూర్ణమైన సిరీస్ లను నిర్వహించారు. అవి ప్రధాన సిరీస్ లకు ప్రతిబింబంగా నిలిచేవి. ఈ నేపథ్యంలో భారత ఏ జట్టుతో కలిసి వెళితే ప్రయోజనం ఉంటుందని గంభీర్ భావిస్తున్నారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గంభీర్ ఇప్పటికే సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో బలమైన టి-20 జట్టును నిర్మించాడు.

 

ఎటాకింగ్ స్టైల్ లో జట్టు అద్భుత విజయాలు నమోదు చేస్తోంది. దీంతో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లేని లోటు కూడా కనిపించడం లేదు. అయితే గంభీర్ వన్డే జట్టు పై మరింత దృష్టి పెట్టాలని కూడా అంటున్నాయి క్రీడా వర్గాలు. ఇక గంభీర్ ముందున్న అతిపెద్ద సవాల్ టెస్ట్ జట్టును పునర్నిర్మించడం. భారత జట్టు ఇంగ్లాండ్ తో కఠిన సిరీస్ ఆడబోతోంది. ఈ కఠిన సవాల్ ని గంభీర్ ఎలా ఎదుర్కొంటాడు అన్నది వేది చూడాలి.

Related News

SL VS PAK : ఆసియా క‌ప్ లో నేడు శ్రీలంక‌-పాక్ మ‌ధ్య పోరు.. చావో రేవో..!

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

Big Stories

×