BigTV English

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Squid Game Season 2 Teaser.. సాధారణంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో సినిమాలు చూడడానికి ఆడియన్స్ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ అన్ని జానర్ల ప్రేక్షకులను మెప్పించిన ఒకే ఒక వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game). కొరియన్ డ్రామా వెబ్ సిరీస్ చూసే ప్రేక్షకులకు ఈ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే భాషతో సంబంధం లేకుండా, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని మెప్పించిన సీరీస్ ఇది. నెట్ ఫ్లిక్స్, ఓటిటిలో రికార్డులు క్రియేట్ చేసిన సిరీస్ అని కూడా మనం చెప్పవచ్చు. ఇకపోతే సీజన్ వన్ పూర్తయిన వెంటనే సీజన్ 2 కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూశారు.


నెట్ ఫ్లిక్స్ నుండీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 టీజర్..

ఇక అందులో భాగంగానే ఈ సిరీస్ కి సెకండ్ సీజన్ కూడా రాబోతోందని చెప్పడంతో ఈ సీజన్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ ఆనందానికి, క్యూరియాసిటీకి అవధులు లేకుండా పోయాయి. ఇదిలా ఉండగా తాజాగా కొద్దిసేపటి క్రితం స్క్విడ్ గేమ్ సీజన్ 2 కి సంబంధించిన తొలి టీజర్ ను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. మరి అది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.


కం బ్యాక్ ఇచ్చిన సియోంగ్ గి హ్యూన్..

స్క్విడ్ గేమ్ సిరీస్ చూసిన ప్రేక్షకులకు. 55 సెకండ్స్ నిడివి గల ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఎందుకంటే మొదటి సీజన్ ఎండ్ నుంచి సెకండ్ సీజన్ మొదలుపెట్టారు. సిరీస్ ప్రధాన పాత్రధారి అయిన సియోంగ్ గి హ్యూన్ ఈసారి మళ్లీ 456 అనే యూనిఫామ్ ధరించి కనిపించారు. ఆయనతో పాటు మ్యాసివ్ క్రౌడ్ కూడా మనం చూడవచ్చు..అయితే ఇక్కడ క్యాష్ ప్రైజ్ మనీ కూడా చూపించారు. అంతేకాదు మ్యాసివ్ క్రౌడ్ మొత్తం గ్రౌండ్లో ఉండడం కూడా చూపించారు.. దీంతో ఈ టీజర్ ఆసక్తికరంగా మారింది అలా విడుదలైందో లేదో ఇలా టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మరి ఈసారి ఈ ప్రైజ్ మనీ ఎంత..?ఈసారి ఆట ఎలా ఉండబోతోంది? ఎంత భయంకరంగా ఉండనుంది..? అనే విషయాలు తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఆధ్యంతం భయపెడుతూ ఉత్కంఠ భరితంగా సాగే ఈ గేమ్ షో కోసం ఆడియన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారనే అయితే స్పష్టం అవుతోంది..

డిసెంబర్ 26 నుండి స్ట్రీమింగ్..

Squid Game Season 2 Teaser: Teaser released by Netflix.. Are you ready to watch this awesome game..?
Squid Game Season 2 Teaser: Teaser released by Netflix.. Are you ready to watch this awesome game..?

తాజాగా ది గేమ్ విల్ నాట్ స్టాప్ అంటూ స్క్విడ్ గేమ్ 2 టీజర్ ప్రారంభంలో మనము అక్షరాలు చూడవచ్చు.ఆ తర్వాత వుయ్ ఆర్ రెడీ టు స్టార్ట్ ద గేమ్ అని మాస్క్ మాన్ నుంచి వాయిస్ మనకు వినిపిస్తుంది. మరి ఈ సీజన్ ఎలా ఆకట్టుకోబోతుందో చూడాలి.ఇకపోతే డిసెంబర్ 26వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. దీనికోసం ఇండియన్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. ఇకపోతే సీజన్ 2 లో పాత పాత్రధారులతో పాటు కొత్తవారు కూడా ఉంటారని తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ కి దర్శకత్వం వహించిన హ్వాంగ్ డాంగ్ హైంక్ కూడా ఈ సీజన్ 2 కి రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా.. ఫస్ట్ మాన్ స్టూడియో పతాకం పై ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇకపోతే 2021లో విడుదలైన స్క్విడ్ గేమ్ సీజన్ వన్ కి కొనసాగింపుగా సీజన్ 2 రాబోతోంది.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×