BigTV English

Single OTT: ఓటీటీకి సిద్ధమైన సింగిల్.. ఎప్పుడు.. ఎందులో అంటే.!

Single OTT: ఓటీటీకి సిద్ధమైన సింగిల్.. ఎప్పుడు.. ఎందులో అంటే.!

Single OTT: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరోయిన్స్ గా వచ్చిన సినిమా సింగిల్. తమిళ్ డైరెక్టర్ కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై విద్యా కోపినీడి, భాను ప్రతాప్ ,నిర్మాతలుగా వ్యవహరించారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన ప్రతి చోటా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. ఆ వివరాలు చూద్దాం..


ఓటీటీకి సిద్ధమైన సింగిల్..

ఎంటర్టైనర్ హీరో శ్రీ విష్ణు ఈ శుక్రవారం సింగిల్ మూవీతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏ ఓటీటీ లో వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తారు. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దియేట్రికల్ రన్ తర్వాత ఓటీడీలో స్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటీటీ లో వస్తున్నట్లు ప్రకటిస్తారు. ప్రస్తుతం ఈ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది అయితే ఎప్పటినుంచి అమెజాన్ ప్రైమ్ లో స్క్రీనింగ్ ఆనందో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మినిమం 60 రోజుల తర్వాత ఈ మూవీ ఓటీటీలో అందుబాటులో ఉండునట్లు సమాచారం. ఏది ఏమైనా శ్రీ విష్ణు సినిమా రిలీజ్ అయిన రోజే ఓటీటీ హక్కులను అమెజాన్ సొంతం చేసుకోవడం తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.


 

కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ గా ..

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్, ప్రభాస్ శ్రీను కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ అందించారు. ఈ చిత్రంలో విజయ్ పాత్రలో శ్రీ విష్ణు నటించారు. కథ విషయానికి వస్తే, విజయ్ ఓ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. ఇన్సూరెన్స్ విభాగంలో అందరితో మాట్లాడుతూ ఆకట్టుకుంటూ వారితో ఇన్సూరెన్స్లు కట్టిస్తూ ఉంటాడు. అదే బ్యాంకులో పని చేసే అరవింద్ (వెన్నెల కిషోర్) ను ఓ అమ్మాయి ప్రేమిస్తుంది. వారిద్దరిని ఎలాగైనా విడగొట్టాలని విజయ్ అనుకుంటాడు. ఈ టైంలోనే పూర్వా(కేతిక )ని చూసి విజయ్ ప్రేమిస్తాడు. ఒక కార్ షోరూమ్ లో పని చేసే ఆమెని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు విజయ్. ఈ క్రమంలోనే డాన్సర్ హరిణి(ఇవానా) తన జీవితంలోకి వస్తుంది. ఓవైపు తనని ప్రేమించమంటూ పూర్వ చుట్టూ విజయ్ తిరుగుతాడు కానీ విజయ్ చుట్టూ హరిని తిరుగుతుంది ఈ ట్రయాగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది తెలియాలంటే ధియేటర్ కెళ్ళి చూడాల్సిందే. దర్శకుడు కార్తీక్ రాజు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని తనదైన స్క్రీన్ ప్లే తో ఎంటర్టైన్మెంట్గా తెరపైకి తీసుకువచ్చారు. ఈ మూవీ శ్రీ విష్ణు కెరియర్ లో హిట్ సినిమా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×