PSL League : పాకిస్తాన్ కి మరో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. పాక్ లో ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇండియా-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉగ్రవాదానికి మద్దతిస్తూ ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కి మరో ఘోర అవమానం జరిగే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి యూఏఈ నిరాకరించింది. వాస్తవానికి యూఏఈకి బీసీసీఐతో మంచి సంబంధాలు ఉన్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు తిరస్కరించింది. ఇండియా-పాక్ ఉద్రిక్తతలు ఉన్నందుకే పీఎస్ఎల్ కి అనుమతి ఇవ్వకపోవచ్చు అని మీడియా పేర్కొంటుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read : Trolls on Curran’s : ప్రమాదంలో సామ్ కర్రన్ ఫ్యామిలీ.. పాకిస్తాన్ ఉగ్రవాదుల వలలో టామ్ కర్రన్?
వాస్తవానికి నిన్న పాకిస్తాన్ జరుగుతున్న PSL వేదికను UAE కి మార్చారు. భారత్ – పాక్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లీగ్ లో భాగంగా మిగిలిన 8 మ్యాచ్ లు UAE లో నిర్వహించనున్నట్టు తెలిపింది. మరోవైపు భారత్ దాడులతో వణికిపోతున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే సురక్సితమైన బంకర్ లోకి వెళ్లిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి పాకిస్తాన్ ఈ సీజన్ లో కావాలనే ఐపీఎల్ కి పోటీగా PSL ని తీసుకొచ్చింది. ప్రతీ సీజన్ లో కూడా ఐపీఎల్ ముగిసిన తరువాత పీఎస్ఎల్ మ్యాచ్ లు జరుగుతాయి. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. భారత్ ఆడే మ్యాచ్ లు అన్ని కూడా దుబాయ్ వేదకగా జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీ విజేత కూడా భారత్ కావడం విశేషం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ వల్ల పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినప్పటికీ నష్టాలు వచ్చాయట. దీంతో కావాలనే భారత్ కి పోటీగా పీఎస్ఎల్ ని తీసుకొచ్చింది.
ఇక పీఎస్ఎల్ లో ఐపీఎల్ లో కొనుగోలు కానీ కొందరూ ఆటగాళ్లు ఉన్నారు. మరికొందరూ రెగ్యులర్ పీఎస్ఎల్ మ్యాచ్ లు ఆడేవారు ఉన్నారు. పీఎస్ఎల్ కారణంగా ఐపీఎల్ లో ఎవరైనా ఆటగాళ్లు గాయానికి గురైతే వారి ప్లేస్ లో మరొకరినీ తీసుకోవాలంటే ఐపీఎల్ జట్లకు కాస్త ఇబ్బందికరంగానే మారింది. అయితే పాకిస్తాన్ – భారత్ ఉద్రిక్తతల వాతావరణ పరిస్తితుల్లో ఇప్పటికే ఐపీఎల్ ని వాయిదా వేశారు. ఇక పీఎస్ఎల్ ని కూడా వేయిదా వేస్తారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో ఎలాగో మ్యాచ్ లు నిర్వహించరు. దుబాయ్ లో కూడా అనుమతి లేకపోవడంతో ఈ సీజన్ లో అటు ఐపీఎల్.. ఇటు పీఎస్ఎల్ రెండు కూడా వాయిదా పడనున్నాయి. పాకిస్తాన్ లో ఉగ్రవాదుల కారణంగా ప్రపంచ దేశాలు సైతం పాక్ పై కాస్త గుర్రుగానే ఉన్నట్టు సమాచారం. మరోవైపు భారత్ పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తే.. భారత్ పాక్ దాడులను తిప్పికొడుతోంది.
BIG BREAKING NEWS 🚨 UAE declines to host Pakistan Super League (PSL).
Another JOLT to Pakistan !!
Emirates Cricket Board has rejected the request from the Pakistan Cricket Board.
Pakistan had already announced that the PSL would be held in the UAE.
Another MASSIVE INSULT… pic.twitter.com/LeEEcyUerY
— Times Algebra (@TimesAlgebraIND) May 9, 2025