BigTV English

Bhagwant Kesari : ఎమోషన్ ఆఫ్ ‘భగవంత్ కేసరి’ విత్ విజ్జి పాప.. టచ్ చేసావు బాలయ్య…

Bhagwant Kesari : ఎమోషన్ ఆఫ్ ‘భగవంత్ కేసరి’ విత్ విజ్జి పాప.. టచ్ చేసావు బాలయ్య…
Bhagwant Kesari

Bhagwant Kesari : అక్టోబర్ 19 విడుదలకు సిద్ధంగా ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా..భగవంత్ కేసరి. నట సింహం తన నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించగా శ్రీ లీల బాలయ్య కూతురుగా కోకిల యొక్క పాత్రలో నటించింది. ఇప్పటివరకు బాలయ్య ఎమోషన్స్ని కరెక్ట్ గా చూపించగలిగేది బోయపాటి మాత్రమే అనే భ్రమణం తొలగిస్తూ నేను సైతం అంటే ముందుకు వచ్చాడు అనిల్ రావిపూడి.


19 నక్షత్రం విడుదల కాబతుండగా ఎమోషన్ ఆఫ్ భగవంత్ కేసరి విత్ విజ్జిపాప అంటూ సరికొత్త మేకింగ్ వీడియో ని మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎమోషనల్ గా కూడా టచ్ చేస్తుంది. ఏ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఉయ్యాలో ఉయ్యాలో పాట తండ్రీ కూతుర్ల ఎమోషన్ చూపించడమే కాకుండా మంచి లిరికల్ హిట్గా నిలిచింది. ఇంతకుముందు విడుదల చేసిన మేకింగ్ వీడియోలో బాలకృష్ణకు సంబంధించిన సూపర్ డూపర్ యాక్షన్స్ సన్నివేశాలను చూపించారు. అయితే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో తండ్రి కూతుర్లు..అదే బాలయ్య , శ్రీ లీల మధ్య ఎమోషనల్ గా సాగే భావోద్వేగా సన్నివేశాలను చూపించారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ,టీజర్, ఫస్ట్ లుక్ ఇలా ప్రతి ఒక్కటి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. పైగా ఇందులో బాలయ్య లుక్ ,మాస్ యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ మూవీ ప్రధానంగా ఐదు పాత్ర చుట్టూ తిరుగుతుంది. అందులో ప్రముఖమైనది బాలయ్య పోషిస్తున్న భగవంత్ కేసరి , తర్వాత సైకాలజిస్ట్ గా కాజల్, జైలర్ గా శరత్ కుమార్, విలన్ గా అర్జున్ రాంపాల్, ఇక కథను కీలకమైన మలుపు తిప్పే ప్రధానమైన పాత్రలో శ్రీ లీల.


బాలయ్య సుమారు దశకం తర్వాత ఈ చిత్రంలో ఫుల్ స్వింగ్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఓ 15 నిమిషాల పాటు బీభత్సవం సృష్టించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అంచనాలు భారీ స్థాయికి చేరుకున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యాక కాసుల వర్షం కురిపిస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు. ఈసారి దసరాకి బాలయ్య మూవీ తో పాటు రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు, విజయ్ లియో సై అంటే సై అంటూ బరిలోకి దిగుతున్నాయి. మరి ఈ దసరా కి విన్నర్ ఎవరో చూడాలి.

ఈ మూవీలో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ డైలాగ్స్ ఇప్పటికే ఆడియన్స్ మనసు దోచుకుంటున్నాయి. బ్రో ..ఐ డోంట్ కేర్.. కూతురు ముందు తండ్రి నిలబడితే వాడే వంద దేవుళ్ళతో సమానం.. షహర్ అనేసి షేర్ షేర్ హీ రెహతా హే బిల్లీ నహి బంతా రే బుల్ బుల్.. లాంటి డైలాగ్ స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇక పెద్ద స్క్రీన్ పై ఫుల్ స్వింగ్ లవ్ బాలయ్య మాస్ యాక్షన్ అభిమానులకు పూనకాలు తెప్పించడం కన్ఫామ్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×