BigTV English

Single Glimpse: ఒకపక్క రొమాంటిక్ పాప.. ఇంకోపక్క లవ్ టుడే భామను పెట్టుకొని సింగిల్ అంటావేంటీ బ్రో.. ?

Single Glimpse: ఒకపక్క రొమాంటిక్ పాప.. ఇంకోపక్క లవ్ టుడే భామను పెట్టుకొని సింగిల్ అంటావేంటీ బ్రో.. ?

Single Glimpse: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నారు శ్రీవిష్ణు. సామాజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ లాంటి సినిమాలతో కామెడీ పంచడంలో కానీ, పంచ్ లు పేల్చడంలో కానీ శ్రీవిష్ణు సిద్ధహస్తుడుగా మారిపోయాడని అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఇక అభిమానులు నచ్చే కథలతో శ్రీవిష్ణు ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు మరో కొత్త కథతో రెడీ అయిపోయాడు.


శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SV18. ఇక ఈ సినిమాను కళ్యా ఫిల్మ్స్  బ్యానర్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప & రియాజ్ చౌదరి నిర్మిస్తుండగా గీత ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో శ్రీవిష్ణు సరసన రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ, లవ్ టుడే బ్యూటీ ఇవానా నటిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 

ఎప్పుడు కథలతోనే కాకుండా టైటిల్స్ లో కూడా వైవిధ్యాన్ని చుస్పించే శ్రీవిష్ణు.. ఈసారి సింగిల్ అంటూ వస్తున్నాడు. SV18 టైటిల్ సింగిల్ అని మేకర్స్ టీజర్ ద్వారా కథను కొద్దిగా రివీల్ చేశారు. వెన్నెల కిషోర్ పార్క్ లో కూర్చొని బాధపడుతుండగా.. ఒక అమ్మాయి.. నువ్వు ఇంకా సింగిలేనా.. ? అని అడగ్గా  ” ముడ్డి కింద 35 ఏళ్లు వచ్చినా కూడా నాకింకా పెళ్లి కాలేదంటే దానికి కారణం ఆ నా కొడుకే.. దరిద్రానికి దత్తపుత్రుడు.. నా చిన్ననాటి మిత్రుడు” అని చెప్పగానే.. ప్రేమికుల మధ్య దీపావళి బాంబ్ లను పెట్టి  పేలుస్తూ శ్రీవిష్ణు ఎంట్రీ ఇచ్చాడు.


Allu Aravind: రామ్ చరణ్‌ను తక్కువ చేసి చెప్పలేదు.. వాడు నాకున్న ఒకే ఒక్క మేనల్లుడు

ప్రేమ సినిమాలో వెంకటేష్ సాంగ్ ఒంటరివాడిని నేను.. అనే సాంగ్ తో రెడ్ బెలూన్ కనిపించినా పగలకొట్టి సైకోలా కనిపించి షాక్ ఇచ్చాడు. అంత  సైకోలా ఉన్నాడు .. లవ్ ఫేయిల్యూరా అని అమ్మాయి అడిగితే.. కరెంట్లీ ఇద్దరు అమ్మాయిలు వాడిని ప్రేమిస్తున్నారు అని చెప్పగానే..  కేతిక శర్మను, ఇవానాను చూపించారు. మరి ఏమైంది అని మిగతా కథ అడగగానే.. వెన్నెల కిషోర్ అన్ని చెప్పడానికి ఇది సినిమా కాదు.. జస్ట్ టైటిల్ టీజర్ అని చెప్పడంతో సింగిల్ అనే టైటిల్ పడుతుంది.

సింగిల్ అనే టైటిల్  తోనే శ్రీవిష్ణు సగం హైప్ తీసుకొచ్చేశాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. శ్రీవిష్ణు.. విక్టరీ వెంకటేష్ కు  ఎంతపెద్ద ఫ్యానో అందరికీ తెల్సిందే. అతని ప్రతి సినిమాలో వెంకీ పేరు, పోస్టర్, సాంగ్.. ఇలా ఏదైనా పెట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈసారి టైటిల్ టీజర్ నే వెంకీ సాంగ్ తో మొదలుపెట్టాడు. ఇక ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

ఇంకొంతమంది ఒకపక్క రొమాంటిక్ పాప.. ఇంకోపక్క లవ్ టుడే భామను పెట్టుకొని సింగిల్ అంటావేంటీ బ్రో.. ?  అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా  త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సింగిల్ తో శ్రీవిష్ణు ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×