BigTV English

Nitish Kumar Reddy: సిక్స్ ప్యాక్ తో షేక్ చేస్తున్న నితీష్ కుమార్..హీరోలు కూడా పనికిరారు !

Nitish Kumar Reddy: సిక్స్ ప్యాక్ తో షేక్ చేస్తున్న నితీష్ కుమార్..హీరోలు కూడా పనికిరారు !

Nitish Kumar Reddy: టీమిండియా స్టార్ క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో నితీష్ కుమార్ రెడ్డి పేరు… టీమిండియా తో పాటు… దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇటు సోషల్ మీడియాలో కూడా నితీష్ కుమార్ రెడ్డి పేరు…. నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటుంది. అయితే తాజాగా… అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తున్నాడు టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy six pack). తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ… లేడీ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాడు.


Also Read: Matthew Breetzke: వన్డేలో చరిత్ర సృష్టించిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్.. LSG కి ఇక పండగే!

గాయం కారణంగా టీమ్ ఇండియాకు దూరమైన… క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం… వైజాగ్ లో ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలోనే… ఎక్ససైజ్, వామ్ అప్ చేస్తూ కనిపించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఈ తరుణంలోనే… వర్క్ అవుట్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి… అనంతరం తన సిక్స్ ప్యాక్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వైట్ టవల్ కట్టుకొని… సిక్స్ ప్యాక్ చూపిస్తూ… ఫోటోలకు ఫోజులిచ్చాడు.


అదే సమయంలో జిమ్ లో వర్కౌట్ చేస్తూ కూడా కనిపించాడు. అనంతరం స్విమ్మింగ్ చేసిన ఫోటోలను కూడా… తన ఫ్యాన్స్ కోసం పంచుకున్నాడు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. అయితే నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) సోషల్.. మీడియాలో పంచుకున్న ఈ ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ అలాగే.. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy ) ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అచ్చం హీరో లా ఉన్నాడు అంటూ… తెగ పొగిడేస్తున్నారు. టీమిండియాలో కంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చేసేయ్… అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది… బాలీవుడ్ హీరోలు కూడా నితీష్ కుమార్ రెడ్డి.. అందం ముందు పనికిరారు అంటున్నారు.

Also Read: Rohit Sharma: ఎక్కువ సిక్సులు బాదిన ప్లేయర్ గా రోహిత్ రికార్డు.. తొలిప్లేయర్ చరిత్ర

ఇది ఇలా ఉండగా…. 2024 డిసెంబర్ మాసంలో.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్ ఆస్ట్రేలియా వేదికగా ఈసారి జరిగింది. అయితే ఈ టోర్నమెంటుకు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డిని తొలిసారిగా సెలెక్ట్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ 2024 టోర్నమెంటులో అద్భుతంగా రాణించడంతో… అనూహ్యంగా జట్టులోకి తెలుగు కుర్రాడు… నితీష్ కుమార్ రెడ్డి రావడం జరిగింది. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో రెగ్యులర్ ప్లేయర్ గా మారిపోయాడు నితీశ్ కుమార్ రెడ్డి. అలాగే టీ20 జట్టులోనూ స్థానం సంపాదించుకుంటున్నాడు. ఇక వన్డే జట్టులోనూ నితీశ్ ను చూడాలని కోరుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.. జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. అంతేకాదు సెంచరీ కూడా చేశాడు. టీమిండియా కు ఓటమి తప్పించాడు. అయితే.. ఆటోర్నమెంట్లు అద్భుతంగా రాణించడంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటు కోసం… ప్రకటించిన జట్టులో నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ చివరికి నితీష్ కుమార్ రెడ్డితో పాటు తిలక్ వర్మ అలాగే మహమ్మద్ సిరాజును కూడా పక్కకు పెట్టారు. ఇక ప్రస్తుతం గాయం కారణంగా… జట్టు నుంచి వైదొలిగాడు నితీష్ కుమార్ రెడ్డి.

కాగా తన కోసం సర్వస్వం త్యాగం చేసిన తండ్రి ముత్యాల రెడ్డికి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు నితీశ్ కుమార్ రెడ్డి. ప్రత్యేకంగా బంగారు బ్రాస్ లైట్ తయారు చేయించి తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ తండ్రీ కొడుకుల అనుబంధంపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

Related News

UAE Vs IND : సూర్య కుమార్ గొప్ప మనసు… UAE బ్యాటర్ ఔట్ అయినా నాటౌట్ ఇచ్చాడు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

ICC : ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం…ఇక‌పై మహిళలే అంపైర్లు, మ్యాచ్‌ రిఫరీలు

Asia Cup 2025 : UAE తో డేన్వర్ భారీ డీలింగ్… ఇండియాను కాదని ఆసియా కప్ లోకి ఎంట్రీ

Gill-Sara : దొంగచాటుగా దుబాయ్ వెళ్లిన సారా.. గిల్ బ్యాటింగ్ చేస్తుండగా క్రౌడ్ లోంచే ?

IND Vs PAK : భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై పిటిషన్‌.. సుప్రీం కోర్టు ఆగ్రహం

Kavya Maran : ఈ ప్లేయర్లను వాడుకుని వదిలేసిన SRH కావ్య పాప?

Asia Cup 2025 : టీమిడియా వర్సెస్ పాకిస్తాన్ కు కుల్దీప్ దూరం.. 4 వికెట్లు తీసినా వేటు పడాల్సిందే!

Asia Cup 2025 : దుబాయ్ స్టేడియం లో టీమిండియా ఫ్యాన్స్ రచ్చ… రోహిత్, కోహ్లీ ప్లకార్డులతో

Big Stories

×