E-Paper
Advertisement

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో

Srikanth Odela: దేవిని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నాడు అంటే ఈసారి ఏం ప్లాన్ చేసాడో
Advertisement

Srikanth Odela: మన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం చాలు అని అంటుంటారు చాలామంది. ఒకే ఒక అవకాశంతో తనేంటో పాన్ ఇండియా స్థాయిలో తెలిసేలా చేశాడో ఒక దర్శకుడు అతనే శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా దసరా అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీకాంత్. ఈ సినిమా నాని కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద నాని సత్తా ఏంటో తెలిసేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ కి వరుసగా అవకాశాలు వచ్చినా కూడా మళ్లీ నానితోనే సినిమా చేయడానికి ముందడుగు వేశాడు. శ్రీకాంత్ ప్రస్తుతం నానితో సినిమాను చేయబోతున్నాడు.

ఇక దసరా సినిమాకి సంబంధించి శ్రీకాంత్ కి మొదటి సినిమా అయినా కూడా నిర్మాత హైటెక్నిషన్స్ ని తీసుకొచ్చి ఇచ్చాడు. దసరా సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడుగా కావాలని అడిగాడు శ్రీకాంత్. మొదటి సినిమా అయినా కూడా ఆ స్థాయి సంగీత దర్శకుని తీసుకొచ్చి శ్రీకాంత్ కి అందించారు అదే స్థాయిలో సంతోష్ నారాయణ కూడా సినిమాకు న్యాయం చేశాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. వెన్నెల అనే పాత్రలో కీర్తి సురేష్ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా మొదటి షో పడినప్పటినుంచి విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

Advertisement

Dasara

అయితే ఇప్పుడు శ్రీకాంత్ నానితో చేయబోయే సినిమాకి దేవిశ్రీప్రసాద్ ను సంగీత దర్శకుడుగా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా కూడా ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ని ఎంచుకోవడంలో ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే దేవిశ్రీప్రసాద్ ఇంతకుముందు తక్కువ కొట్టలేదు. కొన్ని సినిమాల్లో దేవిశ్రీప్రసాద్ మార్క్ క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇకపోతే శ్రీకాంత్ ఓదెల అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రంగస్థలం సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. రంగస్థలం సినిమా ఎంత బాగుంటుందో దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఆ సినిమాకి అంతే ప్లస్ అయింది. అయితే ఆ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాడు దేవి. అందుకే ఇప్పుడు శ్రీకాంత్ కూడా దేవిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనగానే అందరికీ అంచనాలు తారస్థాయిలో చేరిపోయాయి. ఎందుకంటే శ్రీకాంత్ లో ఉన్న మాస్ కమర్షియల్ యాంగిల్ తెలియంది కాదు. ఇదివరకు ఎప్పుడూ నానిని చూపించని విధంగా దసరా సినిమాలో చూపించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఇప్పుడు చేయబోయే సినిమాలో నానిని ఎలా చూపిస్తాడు అని చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Related News

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Big Stories

Advertisement
×