BigTV English

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Chiranjeevi: ఏఎన్నార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం.. చిరు పోస్ట్ వైరల్

Chiranjeevi: టాలీవుడ్  ప్రస్తావన వస్తే.. ఎన్టీఆర్ తరువాత వచ్చే పేరు ఏఎన్నార్.  ఇది పేరు మాత్రమే కాదు  ఒక బ్రాండ్.   పాత్ర ఏదైనా..  ప్రయోగం ఎలాంటిదైనా అది ఏఎన్నార్ వరకు వచ్చేవరకే.  ఒక్కసారి ఆయన వద్దకు వచ్చిందా.. ? ఇక  నిర్మాతలు దాని గురించి ఆలోచించే అవసరమే ఉండేది కాదు.  75 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించిన హీరో అంటే అక్కినేని నాగేశ్వరరావు అనే  చెప్పాలి.  నేడు  ఏఎన్నార్  100 ఏళ్ల వేడుక గ్రాండ్ గా జరుగుతుంది.


ఈరోజుతో ఏఎన్నార్  100 ఏళ్లు పూర్తిచేసుకున్న. ఈ సందర్భంగా అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ఆయనతో పెనవేసుకున్న  జ్ఞాపకాలను  సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.  తాజాగా  మెగాస్టార్ చిరంజీవి సైత  ఏఎన్నార్  ను  తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు.  ఆయనతో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నాడు.

అక్కినేని నాగేశ్వర రావు గారు 100వ జయంతి సందర్భంగా  లెజెండరీ ఏఎన్ఆర్‌ని స్మరించుకుంటూ.. అలనాటి గొప్ప నటులలో ఏఎన్నార్ ఒకరు..  నటనా మేధావి మరియు సినీ రంగానికి చెందిన ప్రముఖుడు. ANR గారు చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మరియు మనస్సులలో చిరస్మరణీయంగా ఉన్నాయి. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు దక్కాయి.  ఆ క్షణాలను, ఆయన చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు  మనతోనే ఉంటాయి” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.  ప్రస్తుతం  ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.


చిరుకు ఏఎన్నార్ కు మధ్య మంచి అనుబంధం ఉంది.  ఆ రోజుల్లో మల్టీస్టారర్  సినిమాలకు కానీ, వేరే స్టార్ హీరో సినిమాల్లో కీలక పాత్రలో కానీ నటించడానికి ఎవరు మొగ్గు చూపేవారు కాదట. కానీ, ఏఎన్నార్.. నటుడు అంటే ఇలాంటి  పాత్రలే చేయాలనీ కానీ,  హీరోగానే  చేయాలనీ కానీ అనుకోకూడదని.. మెకానిక్ అల్లుడు సినిమాలో చిరు తో కలిసి నటించారు. 

బి. గోపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1993 లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ  యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిరు- ఏఎన్నార్ మధ్య వచ్చే  గురువా గురువా సాంగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక తండ్రి లెగసీని కాపాడుతూ అక్కినేని నాగార్జున కూడా  పాత్ర ఏదైనా..  ప్రయోగం ఎలాంటిదైనా  ముందు ఉంటాడు.   మరి భవిష్యత్తులో చిరు- నాగ్ ఏమైనా తెరపై  కనిపించే  ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×