BigTV English

Champion: కల్కి తరువాత ఛాంపియన్ అంటున్న వైజయంతీ మూవీస్..

Champion: కల్కి తరువాత ఛాంపియన్ అంటున్న వైజయంతీ మూవీస్..

Champion: మహానటి తరువాత వైజయంతీ మూవీస్ కల్కి 2898ADతోనే పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది సోషల్ మీడియాను షేక్ చేసిన బ్యానర్ ఏదైనా ఉంది అంటే అది వైజయంతీ మూవీస్ అనే చెప్పాలి. కల్కి సినీనత వచ్చిన పేరును కంటిన్యూ చేయడానికి వైజయంతీ కష్టపడుతుంది. అందులో భాగంగానే ప్రస్తుతం మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టింది.


నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ తో.. వైజయంతీ మూవీస్ ఒక సినిమా అనౌన్క్ చేసిన విషయం తెల్సిందే. దానికి ఛాంపియన్ అనే టైటిల్ ను కూడా అనౌన్స్ చేశారు. అయితే మధ్యలో కల్కితో బిజీగా ఉండడంతో ఈ సినిమా పట్టాలెక్కింది లేదు. దీంతో కొంతమంది ఈ సినిమా ఆగిపోయింది అని కూడా మాట్లాడుకున్నారు. కానీ, ఎట్టకేలకు ఛాంపియన్ నేడు పట్టాలెక్కింది.

ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నేడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో మెప్పించిన ప్రదీప్.. ఈ సినిమాతో డైరెక్టర్ గా వెండితెరకు పరిచయమవుతున్నాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. రోషన్ .. పెళ్లి సందD అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసినా.. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక దీని తరువాత రోషన్ ఇంకో సినిమాను తెలుగులో మొదలుపెట్టలేదు కానీ.. మలయాళంలో మాత్రం మోహన్ లా సినిమాలో ఛాన్స్ పట్టేశాడు.


వృషభ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోహన్ లాల్ కొడుకుగా నటిస్తున్నాడు. అదే లక్కీ ఛాన్స్ అనుకుంటే..వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రోషన్ సినిమా చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అని చెప్పాలి. అయితే స్వప్న సినిమాస్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. నేటి నుంచి షూటింగ్ షురూ చేసిన ఈ సినిమాకు సంబంధించి మిగతా విషయాలు త్వరలోనే మేకర్స్ అధికారికంగా తెలుపనున్నారు. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×