E-Paper
Advertisement

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు
Advertisement

Srivani : బుల్లితెర నటి శ్రీవాణి తాజాగా రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి అంటూ భర్త ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడంతో శ్రీవాణి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మరి ఈ ప్రమాదం ఎక్కడ చోటు చేసుకుంది? ఇప్పుడు నటి శ్రీవాణి పరిస్థితి ఎలా ఉంది? అనే వివరాల్లోకి వెళ్తే..

బీచ్ కి వెళ్తుండగా ప్రమాదం…

Advertisement

శ్రీవాణి బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సీరియల్స్ లో నటించిన ఈ అమ్మడు యూట్యూబ్ లో పలు ఇంటర్వ్యూల ద్వారా మరింత పాపులర్ అయ్యింది. అయితే తాజాగా ఆమెకి యాక్సిడెంట్ అయ్యిందంటూ శ్రీవాణి భర్త విక్రమాదిత్య అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్ ను బయట పెట్టారు. మూడు రోజుల క్రితం శ్రీవాణి ఫ్యామిలీతో కలిసి అందరూ చీరాల బీచ్ కు వెళ్లారట. ఆ ప్రయాణంలోనే రోడ్ పై కార్ ప్రమాదం జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ కార్ యాక్సిడెంట్ లో శ్రీవాణికి బలమైన గాయాలు తగిలాయని, హ్యాండ్ కి ఫ్రాక్చర్ అవ్వడంతో పాటు నుదుటిపై గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకొచ్చారు విక్రమాదిత్య. ఈ నేపథ్యంలోనే ఆయన డాక్టర్లను శ్రీవాణికి ప్లాస్టిక్ సర్జరీ చేయమని కోరినట్టుగా తెలుస్తోంది. శ్రీవాణి నటి కాబట్టి ఆమె తెరపై కనిపించే సమయంలో అ మార్క్స్ కనిపించకుండా ఉండడానికే ఇలా ప్లాస్టిక్ సర్జరీ చేయమని విక్రమాదిత్య డాక్టర్స్ ను కోరారట. అయితే డాక్టర్లు మాత్రం దానికి స్టిచెస్ మాత్రమే వేస్తే మంచిదని విక్రమాదిత్యకు సలహా ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ శ్రీవాణి త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలంటూ విక్రమాదిత్య కోరారు. అంతేకాకుండా ఈ వీడియో చూసిన ఆమె ఫాలోవర్స్ కూడా శ్రీవాణి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

దేవుడికి కృతజ్ఞతలు 

Advertisement

ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీవాణి యాక్సిడెంట్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ చలాకీగా ఉండే శ్రీవాణి యాక్సిడెంట్ కారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉండడం ఆమె అభిమానులను టెన్షన్ పడుతోంది. అందుకే వీలైనంత త్వరగా శ్రీవాణి కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. శ్రీవాణి మాత్రమే కాదు ఆమె భర్త కూడా అనేక సీరియల్స్ లో నటించారు. తామిద్దరం కలిసి కొత్త డెసిషన్స్ తీసుకున్నామని, భార్యాభర్తలుగా ఒకే సీరియల్ లో నటించాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలియజేశారు. అంతా బాగా జరుగుతుంది అనుకునే టైంలో ఇలాంటి ఘటన జరిగిందని బాధపడిన ఆయన వెంకటేశ్వర్ స్వామి దయవలన ప్రమాదం నుంచి బయటపడ్డాము అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఇక సోషల్ మీడియాలో ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుండగా, శ్రీవాణి త్వరగా కోలుకొని టెలివిజన్ లో సందడి చేయాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కాగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి యూట్యూబ్ ను స్టార్ట్ చేశారు. అందులో శ్రీవాణి దంపతులు తమ పర్సనల్ లైఫ్ తో పాటు పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటారు,

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×