SS Thaman :తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మ్యూజిక్ సెన్సేషన్ గా మారిన ఎస్.ఎస్ .తమన్ (SS Thaman)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రతి సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందిస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్నారు. అంతేకాదు ఇటీవలే బాలయ్య (Balakrishna ) నటించిన ‘అఖండ’ సినిమా మొదలుకొని ‘డాకు మహారాజ్’ సినిమాల వరకు అద్భుతమైన సంగీతాన్ని అందించి, నందమూరి తమన్ గా పేరు సంపాదించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్న తమన్, ఈ సందర్భంగా తన చిరకాల కోరికను బయటపెట్టారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం
తలసేమియా బాధితుల సహాయార్థం.. త్వరలో తమన్ మ్యూజిక్ కాన్సర్ట్..
అసలు విషయంలోకి వెళ్తే.. తలసేమియా బాధితుల సహాయార్థం మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించనున్నారు. ఈ కాన్సర్ట్ ప్రతి టికెట్ పై వచ్చే రూపాయి తలసేమియా బాధితులకి, సమాజ సేవకే వెళుతుందని ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తెలిపింది. ఇక ఈ కాన్సర్ట్ లో తమన్ తన బృందంతో పాల్గొని మ్యూజిక్ లవర్స్ ను ఎంటర్టైన్ చేయనున్నారు. అయితే ఈ కాన్సర్ట్ కోసం తమన్ ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు. ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనున్న నేపథ్యంలో ఈ షోకి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. అందులో భాగంగానే తమన్ కొన్ని విషయాలను పంచుకున్నారు.
వృద్ధాశ్రమం నిర్మించడమే తన కోరిక అంటున్న తమన్..
ఇంటర్వ్యూలో భాగంగా తమన్ మాట్లాడుతూ.. “తలసేమియా బాధితులకు సహాయాన్ని అందించడానికి ఈ షో చేయాలని చెప్పగానే.. నేను వెంటనే ఒప్పుకున్నాను. నన్ను నమ్మి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నా చేతిలో పెట్టడం గౌరవంగా భావిస్తున్నాను. కోవిడ్ 19 తర్వాత నాలో సామాజిక స్పృహ కూడా పెరిగింది. సమాజానికి ఏదైనా చేయాలి అనిపిస్తోంది. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత నాలో మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. ఈ మేరకు భవిష్యత్తులో ఒక వృద్ధాశ్రమం నిర్మించాలనే ఆలోచన కూడా నాలో కలిగింది. అయితే చేసిన మంచిని ఎప్పుడూ చెప్పుకోకూడదని అంటారు. అందుకే నేను కూడా ఏం చేసిన బయటకు చెప్పకూడదని నా టీం కి కూడా చెబుతున్నాను” అంటూ ఈ సందర్భంగా తమన్ చెప్పుకొచ్చారు. మొత్తానికైతే భవిష్యత్తులో వృద్ధాశ్రమం పెడతానని చెప్పిన ఈయన.. ఏ మేరకు ఆ వృద్ధాశ్రమం వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. మొత్తానికైతే తమన్ ఆలోచనలకు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. మరికొంతమంది నందమూరి వారసులతో కలిసి కొనసాగుతున్నారు కాబట్టే ఆ అలవాట్లు ,ఆలోచనలు వస్తున్నాయని నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఫిబ్రవరి 15న మ్యూజికల్ కాన్సర్ట్..
ఇకపోతే ఫిబ్రవరి 15వ తేదీన జరగబోతున్న ఈ మ్యూజికల్ కాన్సర్ట్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ షో కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా షో చేయడం పై ఆయన మంచి మనసు కి ఈ ఉదాహరణ అద్దం పడుతోందని చెప్పవచ్చు.