BigTV English

Star director: డైరెక్టర్ భార్యకు ఘోర అవమానం.. ఫ్యాబ్రిక్ స్టోర్ యజమానిపై రివేంజ్..!

Star director: డైరెక్టర్ భార్యకు ఘోర అవమానం.. ఫ్యాబ్రిక్ స్టోర్ యజమానిపై రివేంజ్..!

Star director.. టాలీవుడ్ లో పలు చిత్రాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక స్టార్ డైరెక్టర్ భార్యకు తాజాగా ఘోర అవమానం జరిగింది అంటూ ఒక వార్త వైరల్ అవుతోంది.ముఖ్యంగా ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని డైరెక్టర్ భార్య ను ఘోరంగా అవమానించడం అటు అభిమానులను కూడా ఆగ్రహానికి గురిచేస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు.? ఆ ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని ఎవరు..? అసలు ఏమైంది? ఆమెను ఎందుకు అవమానించారు ? ఇలా పలు ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..


డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి భార్యకు అవమానం..

ప్రముఖ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (Sankalp Reddy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రచయితగా, దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న ఈయన “ఘాజీ” అనే చిత్రంతో తొలిసారి దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా హిందీ, తమిళ్లో కూడా విడుదలయ్యింది. జలాంతర్గామి నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి భారతీయ చిత్రం కూడా ఇదే. అలాగే ఇంతవరకు భూమ్మీద, సముద్రం మీద , గాల్లో జరిగే యుద్ధాలతోనే దేశంలో సినిమాలు వచ్చాయి. కానీ సముద్రం లోపల జరిగే పోరాటంతో తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాగా ఇది రికార్డు సృష్టించింది. రానా దగ్గుపాటి (Rana daggubati) కీలక పాత్ర పోషించిన ఈ సినిమా 65వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ తెలుగు సినిమా పురస్కారాన్ని అందుకుంది. ఇకపోతే 2018లో లావణ్య త్రిపాఠి (Lavanya tripathi), వరుణ్ తేజ్ (Varun Tej) కాంబినేషన్లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ “అంతరిక్షం “అనే సినిమాకి కూడా ఈయనే దర్శకత్వం వహించారు. ఇలా సరికొత్త కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి కి.. ఫ్యాషన్ డిజైనర్ కీర్తి రెడ్డి (Keerthi Reddy) తో వివాహం జరిగింది. వీరికి దేవ్ కవిశ్, శ్యమంత్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.


కీర్తి రెడ్డి కారు టైర్ కోసేసిన ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని..

ఇకపోతే కీర్తి రెడ్డికి ఫ్యాషన్ డిజైనింగ్ లో మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఈమె ఎదుగుదలను ఓర్వలేక ఒక దుస్తుల దుకాణ వ్యాపారి ఈమెను ఘోరంగా అవమానించినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే తాజాగా కీర్తి రెడ్డి.. బంజారాహిల్స్ లో కారు నిలిపి షాపింగ్ కి వెళ్ళగా.. తన షాప్ ముందు కారు నిలిపి వెళ్లిందనే కోపంతో రంగ్రేజ్ ఫ్యాబ్రిక్ స్టోర్ యజమాని ఆమె కారు టైర్లను కోసేశారు. దీంతో తిరిగి వచ్చే చూసిన ఆమెకు భారీ షాక్ తగిలింది. వెంటనే మారు మాట్లాడకుండా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది కీర్తి రెడ్డి . దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఫ్యాబ్రిక్ స్టోర్ యజమానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మొత్తానికైతే ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి భార్య కీర్తి రెడ్డికి జరిగిన ఘోర అవమానానికి ఆయన క్షమాపణలు చెప్పాలని, ఆమె కార్ బాగు చేయించాలని కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×