BigTV English

RSS Workers Injured: మిడ్‌నైట్ హంగామా.. 10 మందిపై కత్తులతో దాడి.. రాత్రి ఏం జరిగిందంటే..

RSS Workers Injured: మిడ్‌నైట్ హంగామా.. 10 మందిపై కత్తులతో దాడి.. రాత్రి ఏం జరిగిందంటే..

RSS Workers Injured| రాత్రంతా గుడిలో జాగారం చేస్తున్న భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ప్రజలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో శుక్రవారం జరిగింది. దీంతో నగరంలో భారీగా నిరసనలు జరుగాయి. రాస్తారోకో అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రోడ్డుపైనే ధర్నాకు కూర్చున్నారు. శాంతి భద్రతల సమస్య కావడంతో కర్ణి విహార్ ప్రాంతంలో పోలీసు బలగాలు దిగి పరిస్థితిని అదుపు చేశాయి.


వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి జైపూర్ నగరంలోని కర్ణి విహార్ ప్రాంతంలో ఒక దేవాలయంలో జాగారం, ప్రత్యేక పూజలు జరుగుతుండగా.. ఇరుగుపొరుగున ఉన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గుడిలో బిగ్గరగా లౌడ్ స్పీకర్లు పెట్టడంతో తమకు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. కానీ గుడిలో భక్తులతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. వారంతా పూజలు జరుగుతున్నప్పుడు భక్తి పాటలు పెట్టడం సహజమే.. లౌడ్ స్పీకర్లు ఆఫ్ చేయడం కుదరదన్నారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

Also Read: నిషేధం ఉన్నా గర్భగుడిలో ప్రవేశించిన సిఎం కుమారుడు.. మండిపడిన ప్రతిపక్షాలు


గొడవ పెద్దది కావడంతో జాగారం చేస్తున్న భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. స్థానికులను కొట్టారు. దీంతో వెనుదిరిగిన స్థానికులు కాసేపు తరువాత తమతో పాటు ఎక్కువ మందిని తీసుకొని వచ్చారు. ఆ సమయంలో గుడిలో ప్రసాదం పంచుతున్నారు. అంతోనే స్థానికులు వచ్చి గుడిలో ఉన్న భక్తులపై దాడి చేశారు. భక్తులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎదురుదాడి చేయడంతో ఇరు వర్గాలు కత్తులు దూసాయి. ఈ ఘటనలో 10 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఢిల్లీ – అజ్మేర్ నేషనల్ హైవేపై కూడా కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రాస్తా రోకో నిరసనలు చేయగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

గాయపడిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు.. శంకర్ బాగ్డా, మురళిలాల్, రామ్ పరీక్, లాఖన్ సింగ్ జడౌన్, పుష్పేంద్ర, దినేశ్ శర్మ్ ని చికిత్స కోసం సమీపంలోని సవాయి మాన్ సింగ్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి స్థానిక ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు తెలియడంతో ఆ ప్రాంతంలో రాస్తా రోకో నిరసనలు చేశారు. రోడ్డుపైనే నిరసనలు చేయడంతో పోలీసు బలగాలు రంగంలో దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

గాయపడిన వారిని పరామర్శించడానికి రాజస్థాన మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటనలో బాధ్యలైన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీనియర్ బిజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే అరుణ్ చతుర్వేదీ మాట్లాడుతూ.. గుడిలో పూజలు చేసుకుంటున్న వారిపై కొందరు కత్తులతో ఆయుధాలతో దాడి చేశారు. వారంతా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.

ఈ ఘటనపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 109 హత్యాయత్నం ఆరోపణలతో గుర్తుతెలియని వ్యక్తులపూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని.. విచారణ చేస్తున్నారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×