BigTV English
Advertisement

Star Heroine: మెగాస్టార్ తో బ్రేకప్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..!

Star Heroine: మెగాస్టార్ తో బ్రేకప్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..!

Star Heroine.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించి బాలీవుడ్ (Bollywood ) లో కూడా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ లలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రేఖ (Rekha ) కూడా ఒకరు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వెళ్లి సత్తా చాటుతూ మొదటి తరం హీరోయిన్ గా ఎంతో మంచి పేరు సొంతం చేసుకుంది. ఎంతోమంది హిందీ సినీ తారలను వెనక్కి నెట్టి తొలి స్టార్ హీరోయిన్ గా తనకంటూ క్రేజ్ సంపాదించుకున్న ఈమె డేట్ ల కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారు. అంతేకాదు ఈమె కాల్ షీట్స్ కోసం , హీరోలు తమ కాల్ షీట్లు కూడా మార్చుకునేవారు అంటే ఈమె డిమాండ్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు.


చైల్డ్ ఆర్టిస్ట్ గా తొలి అడుగు..

ఈమె ఎవరో కాదు తమిళంలో అగ్ర నటుడు, మహానటి సావిత్రి భర్త జెమినీ గణేషన్ , ఈయన మొదటి భార్య పుష్పవల్లి దంపతులకు జన్మించింది రేఖ. రేఖ అసలు పేరు భాను రేఖ గణేషన్. 1958లో ఇంటిగుట్టు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి, తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రంగుల రాట్నం లో కూడా నటించింది. తొలిసారి ఆపరేషన్ జాక్ పాట్ నల్లి సీఐడీ 999 అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దక్షిణాదిలో అన్ని భాషలలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. 1970లో భామ సావన్ బాదో పని హిందీ చిత్రం ద్వారా అక్కడ అడుగుపెట్టి, ఆ తర్వాత ముఖద్దర్ కా సికందర్ అనే సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.


మెగాస్టార్ తో బ్రేకప్..

Star Heroine: Breakup with Big B.. Shocking to see how it is now..!
Star Heroine: Breakup with Big B.. Shocking to see how it is now..!

స్టార్ హీరోయిన్ గా నటించే సమయంలోనే బాలీవుడ్ బిగ్ బి , బాలీవుడ్ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తో ప్రేమలో పడి, జయ కారణంగా విడిపోయింది. ఇద్దరు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే వీరి మధ్యలో జయ ప్రవేశించడంతో అమితాబ్ తో బ్రేకప్ చెప్పుకుంది రేఖ. అలా ఆ తర్వాత ఈమె లవ్ , బ్రేకప్ విషాదంగా మారింది. బ్రేకప్ నుంచి తేరుకున్న రేఖ వ్యాపారవేత్త ముఖేష్ అగర్వాల్ ను వివాహం చేసుకుంది కానీ పెళ్లి జరిగిన ఏడాదిలోపే దాంపత్య జీవితం కూడా ఆగిపోయింది. ఆ తర్వాత చాలామంది హీరోలతో ఎఫైర్ రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్స్ గానే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది రేఖ ఇదిలా ఉండగా తాజాగా చాలా కాలం తర్వాత మీడియా కంటపడి అందరిని ఆశ్చర్యపరిచింది.

69 ల్లో కూడా యంగ్ హీరోయిన్స్ కి పోటీ..

సహజంగా మీడియా ముందుకు రావడానికి ఇష్టపడని రేఖ , తొలిసారి ముంబై ఎయిర్పోర్ట్ లో అభిమానుల కోరిక మేరకు ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే ఈమె ఫోటోలు చూసి అభిమానులే కాదు నెటిజన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. 69 సంవత్సరాల వయసులో కూడా ఇంత గ్లామర్ మెయింటైన్ చేయడం ఎలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా యంగ్ హీరోయిన్ల గ్లామర్ ను కూడా తలదన్నేలా రేఖ అందం ఉందని, ఈమె అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×