BigTV English

Samantha: రెండో పెళ్లిపై కుటుంబంతో చర్చిస్తున్న సమంత.. ముహూర్తం ఎప్పుడంటే..?

Samantha: రెండో పెళ్లిపై కుటుంబంతో చర్చిస్తున్న సమంత.. ముహూర్తం ఎప్పుడంటే..?

Samantha second marriage:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha), అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా పెళ్లయిన నాలుగేళ్లకే విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ సమయంలో చాలామంది సమంత పై నిందలు వేసిన విషయం తెలిసిందే. ఇక వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని.. ఇప్పుడు మళ్లీ హిందీలో వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది సమంత.. ఒకవైపు బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే.. మరొకవైపు ఇటు టాలీవుడ్ లో నిర్మాణ సంస్థను స్థాపించి, తెలుగు సినిమాలు నిర్మించడానికి సిద్ధం అయ్యింది.


రెండో పెళ్లికి సిద్ధమైన సమంత.. వచ్చేనెలే ముహూర్తం..

అయితే ఇలాంటి సమయంలో సమంత రెండో పెళ్లి చర్చలు.. గత కొంతకాలంగా తెరపై వినిపిస్తున్న విషయం తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మెన్’, ‘సిటాడెల్ – హనీ బన్నీ’ వెబ్ సిరీస్ లకు దర్శకత్వం వహించిన రాజ్ నిదిమోరు (Raj Nidimoru)తో సమంత ప్రేమలో ఉందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి తోడు ప్రస్తుతం సమంత నటిస్తున్న ‘రక్త్ బ్రహ్మాండ్ ‘ వెబ్ సిరీస్ కి కూడా రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి తోడు పలు ఈవెంట్లలో వీళ్ళిద్దరూ జంటగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చినా.. దీనిపై ఇద్దరు కూడా స్పందించలేదు. అయితే ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ సమంత రాజ్ నిధిమోరును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు ఈ మేరకు తన కుటుంబ సభ్యులతో కూడా ఆమె చర్చించారట.అటు కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో వచ్చే నెలే ముహూర్తం ఖరారు చేసి, పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం వుందో తెలియదు కానీ ఇప్పుడు సమంత రెండో పెళ్లి అంటూ వార్తలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ వార్తలలో నిజం ఉందా లేదా తెలియాలంటే దీనిపై సమంత స్పందిస్తుందేమో చూడాలి.


నాగచైతన్య కెరియర్..

ఇక నాగచైతన్య విషయానికి వస్తే.. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన ‘ఏ మాయ చేసావే’ సినిమాలో హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి, ఏడేళ్ల ప్రేమాయణం తర్వాత 2017లో ఆమెను వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2020లో వీరిద్దరూ విడిపోయారు. ఇక 2022లో ప్రముఖ తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాల (Shobhita dhulipala) తో ప్రేమలో పడ్డ ఈయన.. 2024 ఆగస్టు 8న ఆమెతో నిశ్చితార్థం చేసుకొని, 2024 డిసెంబర్లో ఆమె మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య రెండవ మ్యారేజ్ తో సంతోషంగా కెరియర్ ను లీడ్ చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే అటు సమంతా కూడా మరో తోడు కోరుకుంటుంది అని సమాచారం. ఇక నాగచైతన్య సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ‘తండేల్’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. ఇప్పుడు తన డ్రీమ్ బిజినెస్ అయినటువంటి హోటల్ బిజినెస్ (షోయూ ) స్టార్ట్ చేశారు. ఇక్కడ ప్రపంచంలో దొరికే పలు ప్రత్యేకమైన వంటలు లభిస్తాయి. అంతేకాదు జపాన్ ఫుడ్ తినాలనిపించినప్పుడు ఎన్టీఆర్ (NTR) కూడా నాగచైతన్య ప్రారంభించిన షోయూ అనే రెస్టారెంట్ కు వెళ్తానని తెలిపారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×