Special Trains: మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు సమ్మర్ హాలీడేస్ రాబోతున్నాయి. ఇంతకాలం పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు కాస్త సాంత్వన కలిగించే పేరెంట్స్ టూర్స్ ప్లాన్ చేస్తున్నారు. వేసవి సెలవులు వచ్చిన వెంటనే కొద్ది రోజుల పాటు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సుమారు నెలన్నర పాటు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో రకరకాల ప్లాన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్ లో ఉండే ప్రజలు ఏపీలోని పర్యాటక ప్రాంతాలతో పాటు పుణ్యక్షేత్రాలకు తిరిగి రావాలని భావిస్తారు. సాధారణ రోజులతో పోల్చితే సమ్మర్ లో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
చర్లపల్లి నుంచి శ్రీకాకుళంకు 24 ప్రత్యేక రైళ్లు
ఇక సమ్మర్ నేపథ్యంలో రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అంచానా వేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరిగినా ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మర్ హాలీడేస్ రష్ ను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ట్రైన్స్ ను అనౌన్స్ చేశారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి శ్రీకాకుళం వరకు మొత్తం 24 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
ఏప్రిల్ 11 నుంచి జూన్ 28 వరకు..
ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 11 నుంచి జూన్ 28 వరకు చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య రాకపోకలు కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 11 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం 07025 నెంబర్ గల రైలు చర్లపల్లి నుంచి బయల్దేరి శ్రీకాకుళం రోడ్డు వరకు వెళ్తుంది. అటు ఏప్రిల్ 12 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం 07026 నెంబర్ గల రైలు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయల్దేరి చర్లపల్లికి చేరుకుంటుంది.
Read Also: విశాఖలో ఇవి కూడా ఫేమస్.. ఓసారి వెళ్లి చూసొస్తే పోలే!
ఈ ప్రత్యేక రైళ్లు ఏ స్టేషన్లలో అగుతాయంటే?
చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు మధ్య రాకపోకలు కొనసాగింగే సమ్మర్ స్పెషల్ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురపల్లి స్టేషన్లలో వచ్చేటప్పుడు, పోయేటప్పుడు ఈ రైళ్లు ఆగుతాయి.
ఇక సమ్మర్ స్పెషల్ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఈ రైళ్లు ఏ సమయానికి బయల్దేరి, ఏ సమయానికి గమ్యస్థానానికి చేరుకుంటాయి? ఏ స్టేషన్ లో ఎంత సేపు హాల్టింగ్ తీసుకుంటానే వివరాలను వెల్లడించలేదు. మరోవైపు తిరుపతి- సాయినగర్ శిర్డీ మధ్య నడిచే 07637/07638 నెంబర్ గల ప్రత్యేక రైళ్లను జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు.
Read Also: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్మిస్తున్నవి ఇవే.. మీరు అస్సలు నమ్మలేరు!