BigTV English

Tollywood Heroine : ఆ హీరోతో స్టార్ హీరోయిన్ ఐదేళ్లు ప్రేమాయణం.. కట్ చేస్తే..

Tollywood Heroine : ఆ హీరోతో స్టార్ హీరోయిన్ ఐదేళ్లు ప్రేమాయణం.. కట్ చేస్తే..

Tollywood Heroine : సినీ ఇండస్ట్రీలోని హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం, పెళ్లిలోవడం ఆ తర్వాత ఇష్టం లేకపోవడమో మనస్పర్ధలు రావడమో విడాకులు తీసుకుంటున్నారు సెలబ్రిటీలు. ఇదంతా ఈ మధ్య కామన్ అయిపోయింది. కొందరు హీరోయిన్ లేము హీరోలతో ఎఫైర్లు పెట్టుకొని, కొద్దిరోజులు బాగానే డేటింగ్ అంటూ తిరగడం ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకోవడం కూడా చేస్తున్నారు.. కొందరు హీరోయిన్లు ప్రేమ అనే మాటకి దూరంగా ఉంటూ తమ సినిమాలు ఏంటో తాము చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. ఇప్పుడు ఒక హీరోయిన్ కొన్నేళ్లపాటు హీరోతో డేటింగ్ లో ఉండి విడిపోయింది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీయా శరన్.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ శ్రియ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె అప్పట్లో ఒక హీరోతో ప్రేమాయణం నడిపిందని వార్తలు ఆ మధ్య వినిపించాయి. ఐదేళ్లు ప్రేమలో ఉన్న హీరోయిన్ ఆ తర్వాత విడిపోయింది. ఆమె ఎందుకు విడిపోయింది వాళ్లిద్దరి మధ్య బ్రేకప్ అవ్వడానికి కారణాలేంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం..


ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న శ్రియ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరు సరసన నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది.. ఈమధ్య ఆమె పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది. ఆమధ్య రాజమౌళి తెరకెక్కించిన సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. అజయ్ దేవ్ గణ్ భార్యగా చేసి మెప్పించారు. ఇక తెలుగులో శ్రియ హీరోయిన్ గా నటించిన చివరి కమర్షియల్ ఎంటర్టైనర్ పైసా వసూల్.. ఆ తరువాత తెలుగులో పెద్దగా సినిమాలు చేసినట్టు లేదు. వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రేయ ఆ తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.. ఆమె పెట్టే ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు అంటే ఆమెకు నెట్టింట ఎంత క్రేజ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు..

ఇక ఈమె గురించి ఇన్నాళ్లకు ఓ విషయం బయటకు వచ్చింది. శ్రియ ఓ హీరోతో ప్రేమాయణం నడిపిందని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఐదు సంవత్సరాలు ముంబై లోశ్రియ సహజీవనం చేసింది అంటూ తాజాగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది.. అంత క్రేజ్ లేని హీరో కాకపోయినా కూడా ఆమె డేటింగ్ లో ఉండింది. ఐదు సంవత్సరాలు సహజీవనం చేశారంటూ అప్పట్లో చాలా వార్తలు వినిపించాయి. ఓ పార్టీలో వీరిద్దరికి పరిచయం ఏర్పడి అలా ఇద్దరు ఒకే ఇంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నారట. ఇక అప్పట్లో వీరిని చూసిన వాళ్ళందరూ త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కుతారని అనుకున్నారు.. కానీ ఫ్యామిలీ ఒప్పుకోక పోవడమో లేదా మరే ఇతర కారణాలో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఇద్దరు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. 2018 లో శ్రియా-ఆండ్రూ వివాహం నిరాడంబరంగా జరిగింది. బంధువులు, సన్నిహితులు మాత్రమే వీరి వివాహానికి హాజరయ్యారు. ఇక పిల్లల్ని కూడా ఆమె రహస్యంగానే కన్నారు. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని ఈ మధ్య బయట పెట్టింది.. ఆ హీరో కూడా మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాలను నిర్మిస్తున్నాడు.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×