Afzalgunj Firing Case: అఫ్జల్ గంజ్ కాల్పుల కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. వీరి కోసం మొత్తం 10 మంది బృందాలు గాలిస్తున్నాయి. సిటీలో నిందితులు తిరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. నిందితులిద్దరూ కాల్పుల తర్వాత బీహార్ పారిపోయినట్టు భావిస్తున్నారు.
ఎంజీబీఎస్ బస్టాండ్‌లో నిందితులు వినియోగించిన బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. బీదర్ ఘటన తర్వాత బైక్‌పై హైదరాబాద్‌కు వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. సిటీలో 1000 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, ఆయా విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కాల్పులు జరిపిన నిందితులు కరుడుగట్టిన నేరస్తులు. నిందితులిద్దరూ హైదరాబాద్ నుండి బీహార్ పారిపోయినట్లు భావిస్తున్నారు. అఫ్జల్‌గంజ్ కాల్పుల్లో గాయపడ్డ జహంగీర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని వైద్యులు తెలిపారు. సిటీ పోలీసులకు బీదర్ అధికారులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.
నిందితులిద్దరూ బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరిద్దరు కలిసి వివిధ రాష్ట్రాల్లో దోపిడీలకు పాల్పడినట్టు తేలింది. గతంలో వీరిపై పలు కేసు నమోదు అయ్యాయి. వీరి కోసం నాలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
ALSO READ: పారా గ్లైడింగ్.. భద్రమేనా..!