Bigg Boss 8:బిగ్ బాస్(Bigg boss).. 2006లో హిందీలో ప్రారంభం అయినప్పుడు.. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ రియాల్టీ షో చూసి మంచి ఎంటర్టైన్మెంట్ పొందారు. అంతేకాదు ఈ షోకి వచ్చిన టిఆర్పి రేటింగ్ చూసి మిగతా భాషలలో కూడా.. ఈ షో నిర్వహించడం మొదలుపెట్టారు నిర్వాహకులు. అందులో భాగంగానే తెలుగులో కూడా ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్.. నిన్నటితో తమిళ్ లో కూడా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. విజయ్ సేతుపతి (Vijay Sethupathy)హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా ఎవరు నిలిచారు? ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీ ఎంత లభించింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 ఆదివారం సాయంత్రం గ్రాండ్ ఫినాలే చాలా అట్టహాసంగా పూర్తయింది. 105 రోజులపాటు ఉత్కంఠ భరితమైన ఈ ప్రయాణానికి ముగింపు పలికింది. ఈ సీజన్లో ఫైనల్స్ లో ముత్తు కుమారన్, వీ. జే.విశాల్, సౌందర్య, రేయాన్, పవిత్ర టాప్ 5 లో నిలిచారు. ప్రతి ఒక్కరు కూడా టైటిల్ కోసం ఎంతగానో కష్టపడ్డారు. అయితే ఆడియన్స దాదాపుగా సౌందర్య(Soundariya)విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో ఉండగా.. చివరిగా బిగ్ బాస్ నిర్వహకులు ట్విస్ట్ ఇస్తూ ముత్తు కుమారన్ (Muthukumaran)ను టైటిల్ విన్నర్ గా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా ముత్తు కుమారన్ నిలవగా.. సౌందర్య రన్నరప్ గా నిలిచింది. ఇక రెండవ రన్నరప్ గా విశాల్ నిలవగా.. ఆ తర్వాత స్థానాలలో పవిత్ర, రేయాన్ నిలిచారు. ఇకపోతే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసే సరికి 49.28% ఓట్లను సొంతం చేసుకొని విజేతగా నిలిచారు ముత్తు కుమారన్. (muthukumaran).
ప్రైజ్ మనీ తో పాటు ఏమేం లభించాయంటే..?
బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 లో విజేతగా నిలిచిన ముత్తు కుమారన్ కి బిగ్ బాస్ టైటిల్ ట్రోఫీ తో పాటు.. మధుర జ్ఞాపకమైన ఒక ఫోటో ఫ్రేమ్ ని కూడా హోస్ట్ విజయ్ సేతుపతి ముత్తు కుమారన్ కు స్టేజ్ పైన అందజేశారు. అలాగే రూ.40,50,000 ప్రైజ్ మనీ కూడా సొంతం చేసుకున్నారు ముత్తు కుమారన్
ఎవరీ ముత్తుకుమారన్..
1997 నవంబర్ 26న కరైకుడిలో జన్మించిన ముత్తు కుమారన్.. 2019లో నాన్ ముత్తు కుమరన్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి, అలా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఎక్కువగా తన వ్యక్తిగత బ్లాగులు చేస్తూ సినిమాలకు సంబంధించిన రివ్యూలు ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. ముఖ్యంగా తన ఛానల్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని రూపొందించుకోవడంతో భారీ పాపులారిటీ లభించింది. ముఖ్యంగా తమిళ సంస్కృతి, ప్రత్యేక కథన శైలి, సంగీతం పట్ల ఘాడమైన అభిరుచిని కలిగి ఉండడంతో తమిళ అభిమానులు ఈయనను మరింత ఓన్ చేసుకున్నారు. ముఖ్యంగా పబ్లిక్ స్పీకర్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. ఇక అదే ఆయనకు బిగ్ బాస్ హౌస్లో అవకాశం లభించేలా చేసింది. ఇక నేడు తన వినూత్నమైన గేమ్ ప్లాన్ తో అందరినీ అబ్బురపరిచి, టైటిల్ విజేతగా నిలిచారు. అంతేకాదు డిజిటల్ యుగానికి రోల్ మోడల్ గా కూడా నిలిచారు ముత్తు కుమారన్.