E-Paper
Advertisement

Star Hero Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో కూతురు..

Star Hero Daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరో కూతురు..
Advertisement

Star Hero Daughter :  సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల కిడ్స్ రాకకు అడ్డు లేదు.. సినీ ఇండస్ట్రీ లో ఇప్పటికే స్టార్స్ గా ఉన్న కొందరు హీరో, హీరోయిన్ల పిల్లలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కొందరు సక్సెస్ ను అందుకోగా, మరికొందరు మాత్రం అడపా దడపా సినిమాల తో ఇండస్ట్రీలో రానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో హీరో కూతురు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్.. ఈయన సినిమాలు భారీ యాక్షన్ సన్నివేశాల్లో కనిపిస్తాయి. కన్నడ రాష్ట్రానికి చెందిన ఈయన బహుభాషా నటుడు, దర్శకుడు, నిర్మాత అన్నది తెలిసిందే. ప్రస్తుతం సినిమాలాను ఎక్కువగా నిర్మిస్తున్నారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే..

ఇప్పటికీ నటిస్తున్న అర్జున్‌ త్వరలో మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈయన కుటుంబం సినిమాకు కేరాఫ్‌ అనే చెప్పవచ్చు.. ఈయన భార్య కూడా పెళ్లికి ముందు హీరోయిన్. ఆమె తండ్రి కూడా నటుడే.. అర్జున్ తో పెళ్లి తర్వాత ఆయన భార్య సినిమాలకు అనూహ్యంగా దూరం అయ్యింది. ఇక వీరికి ఇద్దరు సంతానం. ఇద్దరు కూతుర్లకు నటన అంటే ఆసక్తి ఉండటంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. పెద్ద కూతురు ఐశ్వర్య అర్జున్ ఆల్రెడీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు చేసింది. తమిళంలో విశాల్‌కు జంటగా పట్టత్తు తానై అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత నటుడు అర్జునే మెగా ఫోన్‌ పట్టి కూతురు హీరోయిన్‌గా చేసిన చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. ఇక ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోలేదు దాంతో రీసెంట్ గా స్టార్ కమెడియన్ కొడుకును ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Star hero's daughter who will make an entry as a heroine..
Star hero’s daughter who will make an entry as a heroine..
Advertisement

ఇప్పుడు రెండో కూతురు కూడా సినిమాల్లో కి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందని సమాచారం.. రెండవ కూతురు అంజనా కూడా కథానాయకిగా ఎంట్రీ ఇవ్వడాని కి సిద్ధమవుతున్నారా? అంటే అలాంటి అవకాశం లేకపోలేదు అని సమాధానం సినీ వర్గాల నుంచి వస్తోంది. ఇందుకు బలం చేకూర్చేలా అంజన తను ప్రత్యేకంగా తీయించుకున్న గ్లామరస్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈమె అందం ముందు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అంత అందంగా ఉంది. ఇక ఏ హీరో తో ఎంట్రీ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఈ మధ్య స్టార్ హీరోల కూతుర్ల కు అదృష్టం సరిగ్గా లేదని చెప్పాలి. ఇక ఈ అమ్మడుకు అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.. అర్జున్ నటించిన ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ శ్రీ ఆంజనేయం సినిమాకు ఇప్పటికి ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు..

 

View this post on Instagram

 

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×