BigTV English

Samsung Galaxy M55s launched: శాంసంగ్ న్యూ ఫోన్ లాంచ్.. ఫస్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్, 50MP ఫ్రంట్ కెమెరా అదుర్స్!

Samsung Galaxy M55s launched: శాంసంగ్ న్యూ ఫోన్ లాంచ్.. ఫస్ట్‌ సేల్‌లో భారీ డిస్కౌంట్, 50MP ఫ్రంట్ కెమెరా అదుర్స్!

Samsung Galaxy M55s launched: ఒకప్పుడు ప్రపంచ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్‌లోనూ ఓ వెలుగు వెలిగిన ఫోన్ కంపెనీ ఏదన్నా ఉంది అంటే అది శాంసంగ్ మాత్రమే. ఎందుకంటే ఒకానొక సందర్భంలో శాంసంగ్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫోన్లకు అద్భుతమైన డిమాండ్ ఉండేది. అదే క్రమంలో కంపెనీ సైతం కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ హవా చూపించింది. అయితే మార్కెట్‌లోకి రకరకాలైన స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు రావడంతో ఫోన్ ప్రియులకు శాంసంగ్ పై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. కానీ శాంసంగ్ ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లు అందించి మరింత దూసుకుపోతుంది.


ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డిజైన్లతో కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ వస్తుంది. తాజాగా మరొక కొత్త మొబైల్‌ని పరిచయం చేసింది. Samsung భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M55sని రిలీజ్ చేసింది. ఇది Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో AMOLED డిస్‌ప్లేను అందించారు. గరిష్టంగా 12 GB RAMని కలిగి ఉంది. 45 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. Samsung Galaxy M55s ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. ఇప్పుడు ఈ ఫోన్‌కి సంబంధించిన ధర, స్పెస్పికేషన్ల వివరాలు పూర్తిగా తెలుసుకుందాం.

Samsung Galaxy M55s Specifications


Also Read: ఐఫోన్, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మి ఫోన్లపై కళ్లుచెదిరే డిస్కౌంట్లు.. ఊహించలేరు భయ్యా!

Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2400×1080 పిక్సెల్‌ల పూర్తి HD ప్లస్ రిజల్యూషన్‌తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ 120 Hz వరకు రిఫ్రెష్ రేటును కలిగి ఉంది. అలాగే 1000 పీక్ నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇక Samsung Galaxy M55s ప్రాసెసర్ విషయానికొస్తే.. ఇది Snapdragon 7 Gen 1 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. Adreno 644 GPU దానితో వచ్చింది.

ఫోన్ గరిష్టంగా 12 GB RAMని కలిగి ఉంది. ఫోన్‌లో SD కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేసి స్టోరేజీని పెంచుకోవచ్చు. ఇది తాజా Android 14లో నడుస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50 MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 8 MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2 MP మాక్రో కెమెరాను కూడా కలిగి ఉంది. అదే సమయంలో 50 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 45 వాట్ల ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 mAh పెద్ద బ్యాటరీ అందించబడింది. ఫోన్ సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.

Samsung Galaxy M55s Price

Samsung Galaxy M55s స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.19,999 ధరలో అందుబాటులో ఉంది. అయితే దీంతో పాటు మరో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. కానీ వాటి ధరలు కంపెనీ వెల్లడించలేదు. ఈ నెల అంటే సెప్టెంబర్ 26 నుండి ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌ సహా Samsung వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది. దీని భారీ బ్యాంక్ ఆఫర్లు సైతం లభిస్తున్నాయి. SBI క్రెడిట్ కార్డ్‌పై రూ. 2,000 తక్షణ తగ్గింపు పొందచ్చు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×