BigTV English

Star Singer : విడాకుల బాటలో స్టార్ సింగర్… మూణ్ణాళ్ల ముచ్చట అయిపోయినట్టేనా?

Star Singer : విడాకుల బాటలో స్టార్ సింగర్… మూణ్ణాళ్ల ముచ్చట అయిపోయినట్టేనా?

Star Singer : ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు వరుసగా విడాకుల బాట పడుతున్నారు. తాజాగా మరో స్టార్ సింగర్ రెండవసారి విడాకులు తీసుకోబోతుందని టాక్ నడుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రీసెంట్ గా ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వినిపించాయి. సదరు స్టార్ సింగర్ పాటలతో పాటు మాటలు కూడా చాలా తియ్యగా ఉంటాయి. ఇక ఆమె అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.


ఈ సింగర్ కి ఆల్రెడీ మొదటి పెళ్లి కావడం, విడాకులు తీసుకోవడం వంటివి జరిగిపోయాయి. అయితే చిన్న ఏజ్ లోనే పెద్దలకు ఇష్టం లేకపోయినా ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు బిడ్డలకు తల్లి అయిన ఈ సింగర్ పలు విభేదాల కారణంగా అతని నుంచి ఈ విడాకులు తీసుకుంది. అనంతరం తన కెరీర్ పై ఫోకస్ పెట్టి ఇండస్ట్రీలోనే టాప్ సింగర్ గా ఎదిగింది. చాలా ఎళ్లు ఒంటరిగా ఉన్న ఈ అమ్మడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక రెండవ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే పిల్లల బలవంతం మీద పెళ్లి చేసుకుంది అని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అతను ఒక పెద్ద బిజినెస్ మాన్ కావడంతో డబ్బుల కోసమే ఈ బ్యూటీ అతన్ని పడేసిందని పుకార్లు షికార్లు చేశాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ తో పాటు పెళ్లి కూడా చేసుకుని టాలీవుడ్ మూవీ లవర్స్ కు షాక్ ఇచ్చింది. ఇక పెళ్లయ్యాక విడుదలైన ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టాయి.


అనంతరం తనపై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి రెండో భర్తతో కలిసి తమ ఇద్దరి మనసులు కలవడం వల్లే పెళ్లి చేసుకున్నామని క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పిల్లలకు పెళ్లి చేయాల్సిన వయసులో ఈ సింగర్ పెళ్లి చేసుకోవడమేంటి ? అంటూ వస్తున్న విమర్శలకు తన పిల్లలకు కూడా ఈ పెళ్లి సమ్మతమేనని చెప్పుకొచ్చి అన్ని రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో కొన్నాళ్లకు ఈ బ్యూటీ రెండో పెళ్లికి సంబంధించిన రూమర్లు చల్లబడ్డాయి.

కానీ ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే ఈమె ప్రెగ్నెంట్ అంటూ కొత్త రూమర్లు దావానంలా వ్యాపించాయి. కానీ అవన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేసింది. ఇక లేటు వయసులో పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరి మధ్య అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న టైంలో తాజాగా మరోసారి ఈ బ్యూటీ విడాకులు తీసుకోబోతుందని రూమర్లు గుప్పుమంటున్నాయి. నిజానికి ఈ ఏడాది సదరు సింగర్ కొడుకు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఉన్నట్టుండి ఆ సింగర్ రెండో భర్తతో విడాకులు బాట పట్ట పోతోంది అనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. దానికి కారణం వీరిద్దరి మధ్య మరో వ్యక్తి ఉన్నాడని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ సదర్ సింగర్ రెండోసారి విడాకులు తీసుకోబోతోంది అని రూమర్స్ చూసి మున్నాళ్ళ మూణ్ణాళ్ల తీరిపోయినట్టేనా అంటూ అంటూ నిట్టూరుస్తున్నారు నెటిజెన్లు. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇలా పెళ్లిళ్లు చేసుకోవడం, విడాకులు తీసుకోవడం అనేది ట్రెండ్ గా మారింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×