BigTV English

Allu Arjun: అల్లు అర్జున్ పై హైకోర్టు లో పిటిషన్.. ఏమైందంటే..?

Allu Arjun: అల్లు అర్జున్ పై హైకోర్టు లో పిటిషన్.. ఏమైందంటే..?

Allu Arjun.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun )హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. అసలు విషయంలోకి వెళ్తే 2024 ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో.. నంద్యాలలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు అల్లు అర్జున్. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా.. వాటిని లెక్కచేయకుండా.. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా భారీగా జన సమీకరణ చేపట్టారన్న నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనపై వేసిన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక రేపు విచారణకు రానున్న నేపథ్యం లో కోర్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


అల్లు అర్జున్ పై కేసు ఫైల్.. హైకోర్టులో పిటిషన్..

2024 సార్వత్రిక ఎన్నికలు ఏ రేంజ్ లో విధ్వంసం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా ఒక పార్టీ వ్యక్తులు ఇంకొక పార్టీ వ్యక్తులతో విభేదాలు పెట్టుకొని ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితులు మనం చూసాం. అందుకే బహిరంగ ర్యాలీలు చేయకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే వీటిని లెక్కచేయకుండా అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసిపి నేత శిల్పా రవిచంద్రా రెడ్డి (Shilpa Ravi Chandra Reddy) ని తన సతీమణి స్నేహ రెడ్డి (Sneha Reddy)తో కలిశారు. శిల్పా రవి చంద్రారెడ్డి ఇంటికి సతీష్ సమేతంగా వెళ్లడంతో వీరిని చూడడానికి అభిమానులు బంధువులు కూడా తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే అక్కడ భారీగా జన సమూహం పోగయింది. దీనికి తోడు తన స్నేహితుడు వైసిపి నేత నంద్యాల అభ్యర్థి శిల్పా రవి చంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం కూడా చేశారు. జన సమూహంతో భారీ ర్యాలీలు చేపట్టిన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలను బ్రేక్ చేశాడన్న కారణంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు రేపు పిటిషన్ కి రాబోతున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


అల్లు అర్జున్ సినిమాలు..

ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ (Sukumar )దర్శకత్వంలో అల్లు అర్జున్ పుష్ప(Pushpa)సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టకుండానే అక్కడ భారీ మార్కెట్ ఏర్పాటు చేసుకున్న ఈయన ఇప్పుడు పుష్ప -2 (Pushpa 2)సినిమాతో డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) ఐటమ్ సాంగ్లో నర్తిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అల్లు అర్జున్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఊహకందని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×