E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: ఆదివారం నుంచి శుక్రవారం వరకు వైలెన్స్ కు ఇన్సూరెన్స్

Saripodhaa Sanivaaram: ఆదివారం నుంచి శుక్రవారం వరకు వైలెన్స్ కు ఇన్సూరెన్స్
Advertisement

Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. అందులో ఒకటి సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డివీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డివీవీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. ఎస్ జె సూర్య విలన్ గా కనిపిస్తున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీజర్ లో నాని.. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. సూర్య అనే పాత్రలో నాని కనిపించనున్నాడు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు కూల్ గా ఉండే.. సూర్య, శనివారం వస్తే మాత్రం శివాలెత్తిపోతాడు. అందుకే శనివారం మాత్రం అతడి చేతికి దొరక్కూడదు అని టీజర్ లో చూపించారు. దీంతో అసలు శనివారం మాత్రమే సూర్య ఎందుకు అలా అయిపోతాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని డైరెక్టర్ చెప్పుకొచ్చాడు.

Advertisement

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమ ఆగస్టు 29 న అన్ని భాషల్లో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ఇప్పటికే గరం గరం అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు సూర్య కూల్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని.. మిడిల్ క్లాస్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు.

బైక్ మీద నవ్వుతూ ఆఫీస్ కు వెళ్తున్నట్లు కనిపించాడు. ఇక ఈ పోస్టర్ కు క్యాప్షన్ గా నాని.. ఆదివారం నుండి శుక్రవారం వరకు హింసకు భీమా ఉంది అని రాసుకొచ్చాడు. అంటే సూర్యకు సరిపోదా శనివారం అని ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×