BigTV English
Advertisement

Leo Horoscope: సింహ రాశి వారి జీవితంలో 15 రోజులు ఊహించని సంఘటనలు !

Leo Horoscope: సింహ రాశి వారి జీవితంలో 15 రోజులు ఊహించని సంఘటనలు !

Leo Horoscope: సింహ రాశి అన్ని రాశుల్లో ప్రత్యేకంగా చెబుతారు. సింహ రాశి వారికి గ్రహస్థితిని బట్టి సప్తమంలో శని అష్టమంలో రాహువు తన స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. గ్రాహ స్థానాన్ని బట్టి ఈ రాశివారికి భాగ్య స్థానంలో ఉన్న కుజుడు అగ్రస్థానంలోకి మారనున్నాడు. కుజుడు భాగ్య స్థానం నుంచి రాజ స్థానంలో మారబోతున్నాడు. అంతే కాకుండా గురువుతో కుజుడి కలయిక జరగనుంది.


ఈ రాశి వారికి రాజ్య స్థానంలో రవి అనుకూలమైన స్థానంలో ఉన్నాడు. రవి గ్రహం జూలై 16 తేదీన లాభ స్థానంలోకి మారబోతున్నాడు. లాభ స్థానంలో బుధుడు, శుక్రుడి కలయిక జరగనుంది. ఫలితంగా ఈ రాశి జీవితంలో 21వ తేదీన భారీ మార్పు జరగనుంది. సింహ రాశి వారికి జులై 5 అమావాస్య నుంచి పౌర్ణమి వరకు 15 రోజులు ఎలా ఉండబోతుంది. బుధుడు సింహ రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారనున్నాడు. ఈ గ్రహ స్థితి ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య పరంగా:
సప్తమంలో ఉన్న శని వైవాహిక జీవితంలో కష్టాలను పెంచుతాడు. ఆరోగ్య పరంగా కొన్ని చికాకులు ఎదురవుతాయి. రాజ్య స్థానంలో రవి ఉండడం వల్ల వృత్తిపరంగా మంచి ఫలితాలు పొందుతారు.
లక్ష్మీనారాయణ యుగం:
ఈ రాశివారికి రాజ్య స్థానంలో శుక్రుడు రావడం వల్ల శుక్రుడు, బుధుడు కలిసి లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. అది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఆర్థికంగా వీరు స్థిరపడతారు సమయానికి డబ్బు చేతికి అందుతుంది. జులై 16 వరకు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
వైవాహిక జీవితం:
అష్టమంలో రాహు సంచారం వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించడం మంచిది. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి.
ఉద్యోగ పరంగా:
శని సప్తమ స్థానంలో ఉండడం, భాగ్య స్థానాన్ని సూచించడం వల్ల ప్రతికూలమైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. అయినా కూడా 16వ తేదీ వరకు రవి అనుకూలత మీకు బాగా కలిసొస్తుంది. కాబట్టి ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 16వ తేదీ నుంచి 21 వ తేదీ వరకు ఖర్చులు బాగా పెరుగుతాయి. సింహ రాశి వారికి మొదటి వారం బాగా కలిసొస్తుంది. రెండో వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి.
ఆస్తుల పరంగా:
ఆస్తుల పరంగా స్థిరాస్తి కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఇల్లు, వాహనం ఏదైనా కొనాలనుకున్నా లేదా పెట్టుబడి పెట్టాలనుకున్నా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. గుడ్డిగా ఎవర్ని నమ్మి మోసపోకండి. మోసపూరితమైన మాటలు విని పెట్టుబడులు పెట్టకండి.

Also Read:శని తిరోగమనంతో నవంబర్ 15 వరకు 3 రాశుల వారికి ఆర్థికంగా లాభాలు


రాజకీయాల్లో ఉన్న వారికి:
రాజకీయ పరంగా ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. జాతకపరంగా గోచారం బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు అనుకూలంగా లేదు. పెట్టిన పెట్టుబడులు వెనకకు రావు. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.

Related News

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Vastu tips: రాత్రి పడుకునేటప్పుడు మంచం పక్కన నీళ్ల బాటిల్ పెట్టుకోకూడదా?

Vastu Tips: గుర్రపు నాడా ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మంచిదా? ఆచారం వెనుక ఉన్న అర్థం ఏమిటి?

Big Stories

×