Big Stories

Say no to Child Labour : శ్రమ విడిచిపెట్టాలి.. పుస్తకం పట్టాలి : 22 ఏళ్ల క్రితం వీడియో షేర్ చేసిన చిరంజీవి

Chiranjeevi Shared 22 years old video : మే డే.. ఈ రోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం. ప్రముఖ వ్యక్తులంతా కార్మికులకు సోషల్ మీడియా వేదికగా మే డే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పిల్లలు కార్మికులు అవ్వరు. చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాలి. అని చెబుతూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 22 ఏళ్ల క్రితం చేసిన ఒక వీడియోను ఆయన ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు.

- Advertisement -

ఆ వీడియోలో.. ఇద్దరు తల్లులు, ఇద్దరు పిల్లలున్నారు. ఒక తల్లి తన కూతురికి చదువు చెబుతుంటే.. మరో తల్లి-కూతురు గిన్నెలు కడుగుతుంటారు. మధ్యలో రెండుసార్లు పొరపాటున గిన్నెలు పడిపోవడంతో.. ఎన్నిసార్లు చెప్పాలి.. పాప చదువుకుంటుంది.. సౌండ్ చేయద్దు అని అంటూ విసుక్కుంటుంది.

- Advertisement -

Also Read : ఇసుకను చూసి కాపీ అంటున్నారా.. నాగ్ అశ్విన్ కౌంటర్

అక్కడ పనిచేస్తున్న ఆ తల్లి.. నా కూతురు కూడా ఈ వయసులో చదువుకోవాల్సింది. కానీ ఏం చేస్తాం తలరాత అని మనసులో అనుకుంటుండగా.. చిరంజీవి “చూడమ్మా.. నువ్వు మీ అమ్మాయి తలరాతను మార్చవచ్చు. అలా తలరాతను తిట్టుకుంటూ కూర్చుంటే కాదు. మీ అమ్మాయిని బడికి పంపించమ్మా..” అని చెబుతారు. 22 ఏళ్ల క్రితం పసిపిల్లలని పని పిల్లలుగా మార్చొద్దని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) కోసం చేసిన చిన్ని చేతులు క్యాంపెయిన్ వీడియో ఇది. ఈరోజుకీ రిలెవెంట్ గా అనిపించి షేర్ చేస్తున్నాను. చైల్డ్ లేబర్ ను ప్రోత్సహించకండి. హ్యాపీ మే డే అని చిరంజీవి ఈ వీడియోను పోస్ట్ చేశారు.

https://www.instagram.com/reel/C6aUGIApDFA/?igsh=b2NhMnBocHc5cGp4

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News