E-Paper
Advertisement

Charu Haasan: హాస్పిటల్లో సీనియర్ నటి సుహాసిని తండ్రి..

Charu Haasan: హాస్పిటల్లో సీనియర్ నటి సుహాసిని తండ్రి..
Advertisement

Charu Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కానీ, కమల్ హాసన్ అన్న కూడా ఒక నటుడే అన్న విషయం తెలుసా.. ?. పోనీ సీనియర్ నటి సుహాసిని.. కమల్ కు కూతురు అవుతుందన్న విషయం తెలుసా.. ? అవును, మీరు వింటుంది నిజమే. కమల్ హాసన్ అన్న చారు హాసన్. ఆయన కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు.

1979 నుంచి ఆయన సినిమాల్లో నటిస్తూ వచ్చారు. తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. సూర్య ఐపీఎస్, నిర్ణయం, మాతృ దేవో భవ, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా.. డియర్ కామ్రేడ్ లో విజయ్ దేవరకొండకు తాతగా నటించింది చారు హాసనే.

Advertisement

ఎన్నో మంచి సినిమాల్లో నటించిన ఆయన వయస్సు 93. ప్రస్తుతం వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న చారు హాసన్.. హాస్పిటల్ లో చేరారు. ఈ విషయాన్నీ సుహాసిని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. చారు హాసన్ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ” వెకేషన్ అనుకుంటారా లేదా మీరు దీన్ని మా నాన్నగారికి మెడికల్ స్టేకేషన్ అంటారా..? వైద్యులు నర్సులు మరియు కుమార్తెల నుండి ప్రేమ మరియు సంరక్షణతో ఆయన బాగా కోలుకుంటున్నారు” అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

చారు హాసన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. చారు హాసన్ కు కమల్ హాసన్ కు మధ్య 15 ఏళ్ల గ్యాప్ ఉంది. చారు హాసన్ కు ముగ్గురు కుమార్తెలు. నందిని, సుహాసిని, సుభాషిణి. ప్రస్తుతం వీరు ముగ్గురు తమ తమ వృత్తుల్లో బిజీగా ఉన్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×