BigTV English
Advertisement

Pisces Horoscope: మీనరాశి వారు వీరితో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే !

Pisces Horoscope: మీనరాశి వారు వీరితో జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే అంతే !

Pisces Horoscope: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీన రాశి వారు జీవితంలో ఒక స్త్రీ వల్ల సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మేధావులుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ప్రజలను ఆకట్టుకునే విధంగా మాట్లాడడం, బయట ఆకర్షణీయంగా కల్పించడం మీ యొక్క ప్రత్యేకత. వృత్తి, ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కూడా మీరు రాణిస్తారు. సాధారణంగా ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో కుంగిపోకుండా సాధన కోసం కృషి చేస్తూ ఉంటారు.


ఎన్నిసార్లు సమస్యలు ఎదుర్కున్నా కూడా ఏదో సాధించాలన్న పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తుంటారు. మీరు అలంకరణ ప్రియులు. అలాగే ఇతరుల అభిరుచులను కూడా త్వరగా తెలుసుకోగలుగుతారు.ఈ రాశి వారు ఏదైనా అనుకున్నది సాధించేవరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తక్కువ ఏజ్ లోనే విజయాలను సాధిస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో ఊహించని విధంగా అనేక సుఖాలను కూడా అనుభవిస్తారు.

తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. అయితే వీరికి బంధువర్గంలోని సమస్యలు దీర్ఘకాలం పాటు కొనసాగుతూనే ఉంటాయి. ఏ విషయంలో కూడా ఈ రాశి వారు రాజీ పడకుండా శ్రమిస్తారు. ఇక ఈ రాశి వారు జీవితంలో స్త్రీ మూలంగా ఎన్నో నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఈ రాశివారు స్త్రీలు కావచ్చు లేక పురుషులే కావచ్చు. స్త్రీ మూలంగా మాత్రమే మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు మీ బంధువులు కావచ్చు. లేక కుటుంబ సభ్యులు, పొరుగువారు కూడా కావచ్చు.


ఒకటికి రెండుసార్లు తన మూలంగా మీరు నష్టపోయే పరిస్థితులు కనిపించినప్పుడు వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగని బంధువులను బంధుత్వాలను వదులుకోవాలని కాదు. వారు మీకు శ్రేయోభిలాషులుగా కనిపిస్తూ ఉంటారు కానీ వెనుక కుట్రలు చేస్తారు.స్త్రీ గానీ పురుషులు గానీ వారి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. జీవితకాలం కాబట్టి ఆ స్త్రీ ఎవరో గుర్తించి ఆ స్త్రీకి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ రాశివారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఇంటిపైన కావొచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, విద్య, కుటుంబ జీవితంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఈ రాశి వారి ఫోన్ పై ఎక్కువగా దృష్టి పెట్టకుండా చదువుపై ఏకాగ్రత పెడితే పరిస్థితులు మారుతాయి. వైవాహిక జీవితంలో ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

Also Read: మాలవ్య రాజయోగం.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం

మీన రాశి వారి గౌరవం కూడా పెరుగుతుంది. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ప్రతి విషయాన్ని తగిన విధంగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీరు ఉన్నత స్థాయికి చేరుకోవడం వల్ల పెళ్లి చేసుకునే అవకాశం వస్తుంది. పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీరు ఎవరి నుండచి ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకూడదు. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎంతో మేలు కలుగజేస్తుంది.

Related News

Vastu Tips: ఉదయం లేవగానే.. ఈ వస్తువులు చూస్తే సమస్యలు కోరి కోని తెచ్చుకున్నట్లే ?

Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా.. ఈ దిశలో మొక్కలు పెట్టకూడదు !

Nandi in Shiva temple: శివాలయాల్లో నంది చెవిలోనే మన కోరికలు ఎందుకు చెప్పాలి?

Incense Sticks: పూజ చేసేటప్పుడు.. ఎన్ని అగరబత్తులు వెలిగించాలో తెలుసా ?

Vishnu Katha: మీ ఇంట్లోనే మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువుండాలంటే ఈ కథ చదవండి

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Big Stories

×