E-Paper
Advertisement

Sports Minister Mandaviya: నేడు కాకపోతే రేపు.. అదే ‘ఖేలో ఇండియా’లక్ష్యం: కేంద్రమంత్రి

Sports Minister Mandaviya: నేడు కాకపోతే రేపు.. అదే ‘ఖేలో ఇండియా’లక్ష్యం: కేంద్రమంత్రి
Advertisement

Sports Minister Mandaviya credits Khelo India for Manu Bhaker’s bronze win: దేశంలో ఇంటా బయాట యువ షూటర్ మనుబాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 10 మీ ఎయిర్ పిస్టల్ లో కాంస్య పతకం సాధించి.. భారతదేశానికి తొలిపతకం అందించిన క్రీడాకారిణిగా పేరు ప్రఖ్యాతులు పొందింది.

ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖామంత్రి మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ అసలు మను బాకర్ కాంస్య పతకం గెలుపు వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉందని అన్నారు. నిజానికి చేతిని గాలిలో గురిపెట్టి గంటలు, గంటలు ప్రాక్టీసు చేయడమంటే మాటలు కాదని అన్నారు. ఆ రైఫిల్ కిట్ చాలా బరువు ఉంటుందని తెలిపారు. అంతకష్టపడింది కాబట్టే పతకం లభించిందని అన్నారు.

అయితే రాబోవు రోజుల్లో మను బాకర్ కోచ్ గా మారి, తను విదేశాల్లో నేర్చుకున్న శిక్షణనంతా తన తర్వాత తరానికి నేర్పించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పుడు భారతదేశం ఖేలో ఇండియా ద్వారా క్రీడలపై పెట్టుబడి పెడుతోంది. ఫలితాలు నేడు కాకపోయినా, రేపు అయినా వస్తాయని తెలిపారు.

Advertisement

ఇదంతా ప్రధాని మోదీ ప్రారంభించిన ‘ఖేలో ఇండియా’ పథకంలో భాగంగా జరిగిందని అన్నారు. అందుకే మను బాకర్ శిక్షణ కోసం ఎప్పుడూ లేనట్టుగా రూ.2 కోట్లు పైనే ఖర్చు చేసినట్టు తెలిపారు. శిక్షణ కోసం జర్మనీ, స్విట్లర్లాండ్ వెళ్లింది. అంతేకాదు తనకి కావల్సిన కోచ్ ను నియమించుకునేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించాం. ఎక్కడా బలవంతపు రుద్దుడు లేదని తెలిపారు.

Also Read: ఒలింపిక్స్ లో నేటి భారత షెడ్యూల్ ..

Advertisement

తను విదేశాలకు వెళతానంటే ఆ ఖర్చులు భరించామని అన్నారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని తెలిపారు. ఈసారి వెళ్లినవాళ్లందరూ అలాంటి శిక్షణ పొందిన వారేనని తెలిపారు. మరికొన్ని పతకాలు వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో విజయ్ కుమార్ రజతం, గగన్ నారంగ్ కాంస్యం గెలిచాక మళ్లీ 12 ఏళ్ల తర్వాత మను బాకర్ కాంస్యం గెలిచి భారత పతాకం రెపరెపలాడింది.

కేంద్ర క్రీడాశాఖా మంత్రి మాట్లాడుతూ ఖేలో ఇండియాలో భాగంగా భారతదేశంలో క్రీడాకారులకు సౌకర్యలు మెరుగైనట్టు తెలిపారు. అలాగే పాఠశాలలు, కళాశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడాకారుల్లో నైపుణ్యాలను గుర్తించే కార్యక్రమం మొదలైందని తెలిపారు. వారికి తగిన శిక్షణిచ్చి రాటు దేలిన తర్వాత, అకాడమీలకు తీసుకువెళుతున్నట్టు తెలిపారు. అన్నిటికి మించి ఆటగాళ్లకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని అన్నారు.

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×