BigTV English

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కు ఘోర అవమానం.. అర్రె ఇంత మాట అన్నారేంటి?

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కు ఘోర అవమానం.. అర్రె ఇంత మాట అన్నారేంటి?

Sudigali Sudheer : జబర్దస్త్ షో ద్వారా తన పాపులారిటిని పెంచుకున్న కమెడీయన్స్ లలో సుడిగాలి సుధీర్ కూడా ఒకరు. మ్యాజిక్, సింగింగ్, యాక్టింగ్, డ్యాన్సర్ గా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తన టాలెంట్ తో ఒక్కో సినిమా ఆఫర్ ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. హీరోగా కూడా తన సత్తాను చాటాడు. ఒకవైపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బుల్లి తెర పై కూడా సందడి చేస్తుంటారు. అయితే సుధీర్ పర్సనల్ లైఫ్ మాత్రం బాగోలేదని అతని ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఏమైంది పాపం అనే డౌట్ వస్తుంది కదా.. కేరీర్ పరంగా సక్సెస్ అయ్యాడు కానీ పర్సనల్ లైఫ్ ఖాళీగానే ఉంది. సుధీర్ పెళ్లి పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. రీసెంట్ గా అతని పెళ్లి గురించి ఘోర అవమానం జరిగిందని ఓ వార్త ఇండస్ట్రీలో షిఖారు చేస్తుంది. అసలు నిజా నిజాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


అసలు విషయానికొస్తే.. రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ సినిమాలో నటించాడు. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఇటీవల నిర్వహించారు. దానికి అందరు కమెడీయన్స్ తో పాటుగా సుధీర్ కూడా వచ్చారు. స్టేజ్ మీదకు రాగానే సుజాత సుధీర్ కు పెళ్లి చెయ్యాలా? వద్దా అని అడుగుతుంది. దీంతో ప్రముఖ సినీ, ప్రజా గాయకుడూ, మాజీ ఏంఎల్ ఏ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కూడా సుధీర్ పెళ్లి చేసుకోకపోవడం వల్లే జరుగుతుంది. పెళ్లి అయితే తన గిరాకీ తగ్గిపోతుందనే కారణంతో కూడా సుధీర్ పెళ్లి చేసుకోవడం లేదని చెప్పాడు.. ఆ మాట అనగానే అక్కడ ఉన్న వాళ్ళు అందరు నవ్వారు. ఆ తర్వాత మరో సింగర్ గోరటి వెంకన్న కూడా మాట్లాడుతూ పెళ్లి చేసుకొని ఎవడు సుఖంగా ఉన్నాడు . పెళ్లి అంత అవసరం కూడా కాదు.చేసుకునే పక్షులు లాగా కలిసి ఉండాలని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఆ స్టేజ్ మీద సినిమా గురించి మాట్లాడకుండా సుధీర్ గురించి మాట్లాడటం అందరిని షాక్ కు గురి చేసింది. ఆ ఈవెంట్ కు సుధీర్ హైలెట్ అయ్యాడు. ఇక సుధీర్ మాత్రం వాళ్లు ఎంతగా అంటున్న కూడా మౌనంగా ఉండటంతో ఆయన ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారని తెలుస్తుంది. సినిమా ప్రమోషన్స్ కోసం పిలిచి ఇలా దారుణంగా అవమానిస్తారా అని సుధీర్ ఫ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చే చేస్తున్నారని తెలుస్తుంది. సినిమా ప్రమోషన్స్ కోసం వస్తే అది చూసుకోవాలి కానీ ఇలా చెయ్యడం ఏంటి? రాకేష్ కు కూడా బుద్దిలేదు అంటూ నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక సుధీర్ ఈ ఏడాది రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇక అంతేకాదు ఒక యాక్టర్ తో రిలేషన్లో ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆ అమ్మాయిని పరిచయం చెయ్యనున్నారని టాక్..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×