BigTV English

Highest Paid Actor : వామ్మో.. ఆ హీరోకు రూ. 300 కోట్ల రెమ్యూనరేషనా..?

Highest Paid Actor : వామ్మో.. ఆ హీరోకు రూ. 300 కోట్ల రెమ్యూనరేషనా..?

Highest Paid Actor : ఈ మధ్య ఇండస్ట్రీలో సినిమాలు హిట్ అయ్యే కొద్ది హీరోల రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. ఒక్క బ్లాక్ బాస్టర్ హిట్ సినిమా పడితే ఇక హీరోలు తర్వాత సినిమాలకు రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు రజినీకాంత్ మాత్రమే హైయస్ట్ తీసుకుంటున్నాడని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు అంతకు మించి మరోహిరో తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఒక స్టార్ హీరో ఒకే సినిమాకు రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. వామ్మో సినిమాకు పెట్టిన బడ్జెట్ అతని రెమ్యూనరేషనా అని సినిమా లవర్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


తాజాగా అందుతున్న సమాచారం మేరకు 300 కోట్లు తీసుకుంటున్న స్టార్ హీరో మరెవ్వరో కాదు.. అల్లు అర్జున్. అవును ‘పుష్ప: ది రూల్’ సినిమా కోసం అల్లు అర్జున్ రూ.300 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. షారూక్ ఖాన్ నటించిన జవాన్, సూర్య నటించిన కంగువా వంటి సినిమాల మొత్తం బడ్జెట్ రూ.300-350 కోట్లు కాగా.. అందులో తెలుగులో అల్లు అర్జున్ ఒక్కడి రెమ్యూనరేషన్ రూ.300 కోట్లు అంటూ వార్తలు సోషల్ మీడియాలో వినిపించడంతో అందరు షాక్ అవుతున్నారు.. ఇందులో నిజమేంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది..

ఇక జైలర్ సినిమా కోసం రజినీకాంత్ రూ.250 కోట్లు వరకూ పారితోషికం తీసుకోగా.. లియో మూవీలో నటించినందుకు విజయ్ కూడా రూ.250 కోట్లు వరకూ తీసుకున్నట్లు టాక్. ఇక బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు .. తమ ప్రాఫిట్ షేర్‌తో కలిపి రూ.150 నుంచి 200 కోట్ల వరకు తీసుకుంటున్నారు.. అమీర్ ఖాన్ 230 కోట్లు తీసుకున్నాడు. అయితే ఈ పుష్ప 2 సినిమా టోటల్ బడ్జెట్ 500 కోట్లు. అందులో హీరో ఒక్కడికే అన్ని కోట్లు అంటే కష్టమే అని చెప్పాలి. ఈ సినిమాకు రూ.1,000 కోట్లు పైనే వసూళ్లు చేస్తుందని అంచనాలు మొదలైపోయాయి. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ కూడా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ప్రాఫిట్ షేర్ అంటూ రూ.250 వరకూ ఉంటుంది. మరి ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇక పుష్ప 2 డిసెంబర్ 5 న విడుదల కాబోతుంది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా, షెకావత్ గా ఫహద్ ఫాజిల్ నటించారు. అలానే శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. శ్రీలీల డ్యాన్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. హైపర్ యాక్టివ్.. ఇక అల్లు అర్జున్ కూడా తక్కువేమి కాదు.. వీరిద్దరి డ్యాన్స్ కోసమే సినిమాను చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇక జనవరి వరకు ఈ సినిమాకు పోటీ ఇచ్చే పెద్ద సినిమాలు లేవు.. 1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట..


Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×