OTT Movie : డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈరోజుల్లో ఎంతలా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేక్షకులు ఎంటర్టైన్ అవ్వాలంటే మొదటగా ఓటిటి ఫ్లాట్ ఫామ్ ని ఎంచుకుంటున్నారు. వీటిలో తమకు నచ్చిన సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలలో ఫ్యాంటసీ మూవీలను చూస్తే వచ్చే కిక్కే వేరు. అటువంటి కిక్ ఇచ్చే ఒక మూవీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
రెండు ఓటీటీ లలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ ఫాంటసీ మూవీ పేరు “ది మిదాస్ టచ్” (The Midas touch). హీరోకు అమ్మాయిలను టచ్ చేస్తే వాళ్లు అతనికి పడిపోయే పవర్ వస్తుంది. ఆ పవర్ తో అతడు ఎదుర్కొన్న సమస్యలు ఏంటో మూవీ స్టోరీలో తెలుసుకుందాం. ఈ మూవీ రెండు ఓటీటీ లలో ‘అమెజాన్ ప్రైమ్ వీడియొ’, ‘నెట్ఫ్లిక్స్’ (Amazon prime video), (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఫిలిప్స్ ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ ఉంటాడు. ఇతడు చాలా మొహమాటంగా ఉండటంతో అమ్మాయిలు ఎవరూ ఇతనిని ఇష్టపడకుండా ఉంటారు. అయితే ఫిలిప్స్ కు అమ్మాయిల తో ఎక్కువగా గడపాలని ఉంటుంది. కానీ వాళ్లను డీల్ చేసే పనితనం అతనికి ఉండదు. ఆ కంపెనీలో పనిచేస్తున్న సారా ఎలక్షన్ క్యాంపైన్ కోసం ఒక యాడ్ షూట్ కు తన భర్త జేమ్స్ ను పిలుస్తుంది. అక్కడ జేమ్స్ తో పాటు కొంతమంది ఫిలిప్స్ ను హేళన చేస్తారు. ఆ బాధలో బయటకు వెళ్లి మద్యం సేవిస్తూ ఉంటాడు ఫిలిప్స్. అక్కడికి ఒక వ్యక్తి కొంతమంది అమ్మాయిలతో కలసి వస్తాడు. అతనికి అమ్మాయిలను టచ్ చేస్తే ,వాళ్లు అతని చుట్టూ తిరిగే పవర్ అతనికి ఉంటుంది. ఆ పవర్ తో విసిగిపోయిన ఆ వ్యక్తి ఫిలిప్స్ కు ఆ పవర్ ని దారపోస్తాడు. అప్పటినుంచి ఫిలిప్స్ ఏ అమ్మాయిని టచ్ చేసినా వాళ్లు అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మాయిలకు ఫిలిప్స్ మీద ఫీలింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పటినుంచో అమ్మాయిలతో గడపాలనుకుంటున్న ఫిలిప్స్ కు ఇది ఒక వరంలా అనిపిస్తుంది. అయితే అతనికున్న పవర్ ని కొంతమంది లాక్కోవాలని ట్రై చేస్తారు.
అయితే ఆ పవర్ ఎవరికి పడితే వాళ్లకు రాదని తెలుసుకుంటారు. హీరో అమ్మాయిలతో కొన్ని రోజులు ఎంజాయ్ చేసి విసిగిపోయి ఉంటాడు. ఈ పవర్ నాకొద్దు అనుకొని, ఒక ప్రొఫెసర్ ని కలసి తనకున్న ప్రాబ్లం ని చెప్తాడు. ఇదివరకే ఆ ప్రొఫెసర్ కి ఈ పవర్ గురించి తెలియడంతో జేమ్స్ కి కొన్ని సూచనలు ఇస్తాడు. ఆ పవర్ ని పూర్వకాలంలో ఒక ప్రేమికుడు ప్రాణంగా ప్రేమించే అమ్మాయి మీద ప్రయోగిస్తాడని జేమ్స్ కి చెప్తాడు. ఆ ప్రేమికుడు సంపాదించిన ఆ శక్తి ఇప్పుడు నీ వరకు వచ్చిందని తెలియజేస్తాడు. ఆ శక్తి మంచి హృదయం ఉన్న వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళుతుందని చెప్తాడు. మరోవైపు అతనికి ఉన్న పవర్ ని ఎలాగైనా పొందాలని కొంతమంది అతనిని కిడ్నాప్ చేస్తారు. చివరికి ఆ పవర్ ని కిడ్నాపర్స్ దక్కించుకున్నారా? ఫిలిప్స్ ని ఆ పవర్ వదిలిపెట్టదా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫాంటసీ మూవీని తప్పకుండా చూడండి.