E-Paper
Advertisement

Aham Reboot Trailer: అక్కినేని హీరో ప్రయోగం.. ఈసారైనా హిట్ దక్కేనా.. ?

Aham Reboot Trailer: అక్కినేని హీరో ప్రయోగం.. ఈసారైనా హిట్ దక్కేనా.. ?
Advertisement

Aham Reboot Trailer: అక్కినేని హీరో సుమంత్ నటించిన అహం రీబూట్ ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. 2021 లో ప్రకటించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ బాట పట్టడం విశేషం. ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను.. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మించారు.

అప్పట్లో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం కలిగింది. హాలీవుడ్ లో హిట్ అయినా ది గిల్టీ అనే సినిమాకు రీమేక్ గానే అహం రీబూట్ తెరకెక్కింది. ఆహాలో జూన్ 30 నుంచి అహం రీబూట్  స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Advertisement

ట్రైలర్ ను బట్టి ఇదొక ప్రయోగం అని అర్దమవుతుంది. హీరో క్యారెక్టర్ తప్ప వేరే ఎవరు ఉండరు. అంటే సింగిల్ క్యారెక్టర్ సినిమా అన్నమాట. సుమంత్ ఒక్కడే ట్రైలర్ మొత్తం కనిపించాడు. కథ విషయానికొస్తే.. నిలయ్.. ఒక ఆర్జే. నైట్ షిఫ్ట్ చేస్తుంటాడు. అతనికి ఒక కాల్ వస్తుంది. అందులో ఒక అమ్మాయి.. తనను ఎవరో కిడ్నప్ చేసారని, కాపాడమని చెప్తుంది. మొదట సీరియస్ గా తీసుకొని నిలయ్.. ఆ తరువాత అతని పై అధికారి చెప్పడంతో సీరియస్ గా తీసుకుంటాడు. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యతను నిలయ్ మీద పెడతాడు.

ఇక ఫోన్ లోనే ఆమె ఎక్కడ ఉంది అనేది విలన్స్ కు తెలియకుండా పజిల్స్ ద్వారా చెప్పమంటాడు. మరి చివరికి నిలయ్..ఆ అమ్మాయిని కాపాడాడా.. ? లేక అమ్మాయి ట్రాప్ లో నిలయ్ పడ్డాడా.. ? ఎవరు అదంతా చేస్తుంది.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది. మరి ఈ సినిమాతోనైనా సుమంత్ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×