BigTV English

Roshan Kanakala: పొలిటీషియన్ ఇంటికి అల్లుడుగా సుమ కొడుకు.. పెళ్లి ఎప్పుడంటే..?

Roshan Kanakala: పొలిటీషియన్ ఇంటికి అల్లుడుగా సుమ కొడుకు.. పెళ్లి ఎప్పుడంటే..?

Roshan Kanakala: తెలుగు ఇండస్ట్రీలో టాప్ యాంకర్ అంటే టక్కువ సుమ పేరే ముందుగా వినిపిస్తుంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా ఆమె స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు.. ఆమె చేసే ప్రతి ప్రోగ్రాం మంచి సక్సెస్ స్టాప్ ని అందుకోవడంతో సినిమా వాళ్ళ సైతం సుమతో ప్రోగ్రాం చేయించాలని ఆమె డేట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. అలా సుమా మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగులో స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇండస్ట్రీలో ఎంతో మంది యాంకర్లు ఉన్నారు కానీ సుమ యాంకరింగ్ చాలా డిఫరెంట్.. చేతిలో మైక్ పట్టుకుంటే చాలు మాటలు అలా దొర్లి వచ్చేస్తాయి. ఎంతటి బడా హీరో ప్రోగ్రాం అయినా సరే సుమ తప్పనిసరిగా హ్యాండిల్ చేస్తుంది. ఇక సుమ ఫ్యామిలీ విషయానికొస్తే.. నటుడు రాజీవ్ కనకలను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. తన కొడుకు రోషన్ కనకాల ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ హీరో పెళ్లి త్వరలోనే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అవి నిజమో కాదో ఇప్పుడు తెలుసుకుందాం..


ప్రతిరోజు ఆడియో ఫంక్షన్లు పలు రియాలిటీ షోలు ఇలా ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా గడుపుతుంది.. అలాంటి సుమ తాజాగా జయమ్మ పంచాయతీ అనే చిత్రం ద్వారా మన ముందుకు వచ్చింది. ఈ విధంగా ఇండస్ట్రీలో యాంకరింగ్ లోనే కాకుండా, నటిగా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుమ ఓ పొలిటిషియన్ ఇంటికి వియ్యపురాలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది.

అసలు విషయానికొస్తే.. యాంకర్ సుమా ఫ్యామిలీ నుంచి రాజీవ్ కనకాల సుమా గురించి మాత్రమే మనం వార్తలు విన్నాం. కానీ ఈసారి తన కొడుకు రోషన్ వల్ల సుమ ఫ్యామిలీ గురించి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. అయితే రోషన్ కూడా ఒక బడా రాజకీయ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అమ్మాయిని ప్రేమించాడని, ఆ అమ్మాయి కూడా ఈయన తో పీకల్లోతు ప్రేమలో ఉందని చేసుకుంటే రోషన్ నే చేసుకుంటానని మొండికేసి కూర్చుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీంతో రెండు ఫ్యామిలీలు వీళ్లకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారని సోషల్ మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే సుమ క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే.. తరుణంలో రోషన్ బబుల్ గం అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఇంకా ఏ సినిమా కూడా ప్రకటించలేదు.. పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక సుమ ఈ విషయం పై స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం సినిమాల ఈవెంట్స్ చేస్తూ సుమ బిజీగా ఉంది.


Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×